Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జ‌న‌వ‌రి 4 నుండి యంగ్‌ హీరో నాగశౌర్య 'ల‌క్ష్య' చివ‌రి షెడ్యూల్‌

జ‌న‌వ‌రి 4 నుండి యంగ్‌ హీరో నాగశౌర్య 'ల‌క్ష్య' చివ‌రి షెడ్యూల్‌
, శుక్రవారం, 1 జనవరి 2021 (20:00 IST)
యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ల‌క్ష్య`. సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై  ప్ర‌ముఖ నిర్మాత‌లు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. నాగ‌శౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. 
 
ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా చివ‌రిషెడ్యూల్ ఈ నెల 4 నుండి ప్రారంభంకానుంది. కాగా నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌తో స‌రికొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. నాగ‌శౌర్య కుడి చేతికి క‌ట్టు క‌ట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో ఉన్న ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది.
 
ఈ మూవీ నుండి ఇప్ప‌టికే విడుద‌ల‌చేసిన స్ట‌న్నింగ్‌ ఫస్ట్‌లుక్ అంద‌రినీ థ్రిల్ చేసింది. `ది గేమ్ విల్ నెవ‌ర్ బీ ద  సేమ్’ అంటూ ఎయిట్‌ ప్యాక్ బాడీతో చేతిలో బాణం ప‌ట్టుకుని వారియ‌ర్ పోజ్‌లో నాగ‌శౌర్య ఉన్న లుక్ సూప‌ర్బ్ అని అంద‌రూ అప్రి‌షియేట్ చేశారు.
 
యంగ్ హీరో నాగశౌర్య, కేతిక‌శ‌ర్మ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: రామ్‌రెడ్డి, సంగీతం:  కాల‌బైర‌వ‌, ఎడిట‌ర్‌:  జునైద్‌, నిర్మాత‌లు: నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సంతోష్‌ జాగర్లపూడి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స‌ప్త‌గిరి హీరోగా 'ఎయిట్' ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్ విడుద‌ల‌