Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు శుభవార్త.. 52 పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (14:38 IST)
కరోనా కాలంలోనూ వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రముఖ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. దాదాపు 52 పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంస్థకు చెందిన బెంగళూరు కాంప్లెక్స్ లో పని చేయడానికి ఈ నియామకాలను చేపట్టింది. ఫ్రెష్ ఇంజనీర్స్, టెక్నీషియన్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 
 
టెక్నీషియన్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు మొదట ఆరు నెలలు టెక్నీషియన్ Cగా పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మొదట ఆరు నెలలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీలు(EAT)గా పని చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారికి నెలకు రూ. 10 వేలు ఉపకార వేతనం చెల్లిస్తారు. అనంతరం వారు పర్మినెంట్ అవుతారు. పర్మినెంట్ అయిన తర్వాత ఇంజనీర్లకు నెలకు రూ. 90 వేలు, టెక్నీషియన్లకు నెలకు రూ. 82 వేల పాటు వేతనం అందించనున్నారు. BEL విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 
 
అందులో 25 Engineering Assistant Trainees కాగా, మరో 27 Technician C పోస్టులు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థలో మూడేళ్ల డిప్లొమో కోర్సును ముగించి వుండాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం