2026 కోసం అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తులను కోరిన అశోకా యూనివర్శిటీ

ఐవీఆర్
శుక్రవారం, 17 అక్టోబరు 2025 (19:17 IST)
అంతర విభాగాల కంప్యూటర్ సైన్స్, నేచురల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ లో భారతదేశపు ప్రముఖ సంస్థల్లో ఒకటైన అశోకా యూనివర్శిటీ తమ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో దరఖాస్తుల ప్రక్రియను సోమవారం, అక్టోబర్ 13,2025 నుండి ప్రారంభించింది. అనుభవం మరియు వివిధ విభాగాల గురించి నేర్చుకోవడంతో పాటు విద్యా శ్రేష్టతను కూడా కలిపిన అండర్ గ్రాడ్యుయేట్ ఆఫరింగ్స్ యొక్క విస్తృత శ్రేణి నుండి దరఖాస్తులు ఎంచుకోవచ్చు.
 
2025-2026 అడ్మిషన్ సైకిల్ పలు గణనీయమైన అప్ డేట్స్‌ను పరిచయం చేసింది. ఇది అందరికీ అందుబాటులో ఉంచాలని అశోకా యూనివర్శిటీ యొక్క కలను సూచిస్తోంది. బహుళ విద్యా మార్గాలను అందిస్తోంది, భారతదేశంవ్యాప్తంగా ఉన్నత విజయాలు సాధించే విద్యార్థులకు మద్దతునిస్తోంది.
 
2026 అడ్మిషన్స్ సైకిల్ కోసం కీలకమైన ప్రధానాంశాలు:
యోగ్యత, అవసరం ఆధారిత ఉపకారవేతనాల విస్తరణ
అన్ని ప్రోగ్రాంస్ లో 500 యోగ్యత, అవసరం ఆధారిత ఉపకారవేతనాలను ప్రకటించడం ద్వారా ఆర్థికంగా సమీకృతం చేయడానికి అశోకా యూనివర్శిటీ తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది. వీటిలో నుండి 200 ఉపకారవేతనాలు యోగ్యతా ఉపకారవేతనాలుగా మొదటిసారి పరిచయం చేయబడ్డాయి.
 
A. ప్రత్యేకమైన యోగ్యతా ఉపకారవేతనాలు (50)
JEE మెయిన్స్, IISER (IAT), CMI మరియు ఇండియన్ నేషనల్ ఒలంపియాడ్స్ (INO)లో 50 అసాధారణమైన విద్యార్థులకు 100% ట్యూషన్ ఫీజు మాఫీ సౌకర్యం అందచేయబడుతుంది. ఈ జాతీయ ఆప్టిట్యూట్ పరీక్షల్లో అత్యధిక స్కోర్స్ తో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ప్రత్యేకమైన ఉపకారవేతనాల నుండి ప్రయోజనం పొందుతారు.
 
అర్హమైన ప్రమాణం:
JEE మెయిన్స్ లో కనీసం 98% శాతం
IISER ఆప్టిట్యూట్ పరీక్షలో టాప్ 2000 ర్యాంక్
CMI ప్రవేశ పరీక్షలో టాప్ 100 ర్యాంక్
గణితం, సైన్స్, అస్ట్రానమీ, లింగ్విస్టిక్స్ మరియు ఇన్ఫర్మేటిక్స్ లో ఇండియన్ నేషనల్ ఒలంపియాడ్స్ ( INO)యొక్క ట్రైనింగ్ క్యాంప్ కోసం అర్హత పొందిన అభ్యర్థులు
 
B. అచీవర్స్ మెరిట్ ఉపకారవేతనాలు (150)
స్కూల్ బోర్డ్ పరీక్షల్లో (CBSE మరియు ICSE/ISC)లో ఉన్నతమైన ప్రదర్శన కోసం వచ్చిన గుర్తింపుతో సమగ్రమైన అశోకా యూనివర్శిటీ అడ్మిషన్స్ ప్రక్రియలో మొత్తం సామర్థ్యం ఆధారంగా ప్రవేశాలు పొందిన 150 మంది విద్యార్థులకు 100% వరకు ట్యూషన్ ఫీజు మాఫీ సౌకర్యం అందచేయబడుతుంది.
 
అర్హమైన ప్రమాణం:
CBSE మరియు ISCE/ISC Xవ తరగతి మరియు XIIవ తరగతి (ఫైనల్ లేదా అంచనా వేయబడింది) బోర్డ్ స్కోర్స్- 98% మరియు ఆపై
అశోకా ప్రవేశాల ప్రక్రియలో శక్తివంతమైన ప్రదర్శన
విలక్షణంగా, ప్రత్యేకమైన యోగ్యతా ఉపకారవేతనాలు మరియు అచీవర్స్ మెరిట్ ఉపకారవేతనాల యొక్క అవార్డుగ్రహీతలు అందరూ అదనపు అవసరం ఆధారిత సహాయం కోసం అర్హులుగా ఉంటారు, ఆర్థిక అడ్డంకులు విద్యా సామర్థ్యాన్ని అధిగమించలేవని నిర్థారిస్తాయి.
 
C. అవసరం ఆధారిత ఉపకారవేతనాలు
యూనివర్శిటీ నుండి ఆర్థిక మద్దతు అవసరమైన, ప్రవేశాలు పొందిన విద్యార్థులకు 100% అవసరం ఆధారిత ట్యూషన్ ఫీజు/పూర్తి మాఫీ సౌకర్యం అందచేయబడతాయి. వారి అంచనా వేయబడిన విద్యా వ్యయం కోసం ఆర్థిక సహాయం చేయడానికి విద్యార్థుల తక్షణ కుటుంబానికి లభించే ప్రస్తుత ఆదాయం, ఆదాలు, పెట్టుబడులు, విద్యా రుణాల నుండి వివిధ ఆర్థిక వనరులు ఆధారంతో సహా వారికి లభించే వివిధ ఆర్థిక వనరులపై విద్యార్థి చెల్లింపు చేసే సామర్థ్యం అంచనా వేయబడుతుంది. అవసరమైన ఆర్థిక సహాయం చేయడానికి మేము ప్రయత్నిస్తాము. ఇది ప్రవేశాలు పొందిన విద్యార్థులు ప్రోగ్రాం యొక్క వ్యయం, వారు చెల్లించే సామర్థ్యం మధ్య లోటును తీరుస్తుంది.
 
నాలుగు విడతల దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తులు నాలుగు విడతల్లో ఆమోదించబడతాయి, అక్టోబర్ 13, 2025 నుండి ప్రారంభించబడిన ఈ దరఖాస్తు ప్రక్రియలో విద్యార్థులు దరఖాస్తు చేయడానికి వివిధ అవకాశాలు ఇవ్వబడతాయి.
 
కేంద్రం ఆధారిత ప్రవేశాల అంచనాలు
భారతదేశపు నివాసుల కోసం, దేశవ్యాప్తంగా 37 భౌతిక కేంద్రాల్లో అశోకా అడ్మిషన్స్ అంచనాలు నిర్వహించబడతాయి, భారతదేశంవ్యాప్తంగా విస్తృత శ్రేణి ప్రాంతాల నుండి దరఖాస్తుల కోసం లభ్యతను నిర్థారిస్తాయి. నాన్-రెసిడెంట్ ఇండియన్స్ ఐ యామ్ నాట్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆప్షన్ ఎంచుకోవాలి. శారీరక వైకల్యాలు, సంచరించడం/కండరాల బలహీనత వలన శారీరక దుర్భలత కలిగిన దరఖాస్తులు ప్రత్యేకంగా పరిగణించబడతారు.
 
దరఖాస్తు కోసం సమయ వ్యవధి
అడ్మిషన్స్ ప్రక్రియ నాలుగు దరఖాస్తు ప్రక్రియ విడతల్లో జరుగుతుంది, అక్టోబర్ 13, 2025న ప్రారంభమవుతుంది, మే 31, 2026న ముగుస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

Rashmika : దీపావళికి మంచి అప్ డేట్ ఇస్తానంటున్న రశ్మిక మందన్న

RC 17: పుష్ప 3 కు బ్రేక్ - రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్.సి. 17 రెడీ

Aadi Sai Kumar: ఆది సాయి కుమార్ మిస్టికల్ థ్రిల్లర్ శంబాల రిలీజ్ అనౌన్స్‌మెంట్

Dude: ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments