ANTHE 2024ను ప్రారంభించిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్

ఐవీఆర్
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (18:31 IST)
తమ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ పరీక్ష ANTHE ప్రారంభించి 15 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకోవటంను గుర్తుచేసుకుంటూ, టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామి అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL), విద్యార్థులు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ (ANTHE) 2024 యొక్క తాజా ఎడిషన్‌ను నెల్లూరులో  ప్రారంభించింది. నెల్లూరులో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ  కె.ఎస్.ఆర్.ఎస్. సుబ్రమణ్యం (అసిస్టెంట్  డైరెక్టర్- అకడమిక్స్), శ్రీ  వి.అర్జున్ (ఏరియా ఆపరేషన్స్ హెడ్) & శ్రీ  ఎస్. రాజశేఖర్ (బ్రాంచ్ మేనేజర్, నెల్లూరు) పాల్గొన్నారు.VII-XII తరగతి విద్యార్థులకు గణనీయమైన నగదు అవార్డులతో పాటు 100% స్కాలర్‌షిప్‌లను పొందే అవకాశాన్ని ANTHE  అందిస్తుంది,  ఈ సంవత్సరం,  అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు అత్యుత్తమ విద్యార్థుల కోసం యుఎస్ఏ లోని ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు 5-రోజుల అన్ని ఖర్చులు-చెల్లింపుతో కూడిన పర్యటనను అందిస్తున్నారు.  

ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) యొక్క సీఈఓ మరియు ఎండి  శ్రీ  దీపక్ మెహ్రోత్రా మాట్లాడుతూ  “ విద్యార్థుల ఆకాంక్షలు , సామర్థ్యాల మధ్య అంతరాన్ని తగ్గించడంలో ANTHE కీలక పాత్ర పోషిస్తుంది.  ANTHE 2024తో, మేము భవిష్యత్ వైద్యులు మరియు ఇంజనీర్‌లను పెంపొందించడానికి మరియు శాస్త్ర, సాంకేతిక,  ఇంజనీరింగ్ మరియు గణితం రంగంలో భారతదేశం గర్వించేలా మార్గదర్శకత్వం వహించే తదుపరి APJ అబ్దుల్ కలాం, HG ఖోరానా, MS స్వామినాథన్ మరియు JC బోస్‌ల కోసం శోధించడానికి జాతీయ ప్రతిభ శోధనను ప్రారంభిస్తున్నాము" అని అన్నారు. ANTHE 2024 అక్టోబర్ 19-27, 2024 మధ్య ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మోడ్‌లలో జరుగుతుంది. ANTHE ఆఫ్‌లైన్ పరీక్షలు 2024 అక్టోబర్ 20 మరియు 27 తేదీలలో దేశవ్యాప్తంగా ఆకాష్ ఇన్‌స్టిట్యూట్‌లోని 315+ కేంద్రాలలో నిర్వహించబడతాయి, అయితే ఆన్‌లైన్ పరీక్షలను అక్టోబర్ 19 నుండి 27, 2024 వరకు ఎగ్జామ్ విండో సమయంలో   విద్యార్థులు తమకు అనుకూలమైన ఒక గంట స్లాట్‌ను ఎంచుకోవచ్చు.

ANTHE 2024 కోసం ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆన్‌లైన్ పరీక్ష ప్రారంభానికి మూడు రోజుల ముందు మరియు ఆఫ్‌లైన్ పరీక్షకు ఏడు రోజుల ముందు ఉంటుంది . ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ విధానాలు  రెండింటికీ పరీక్ష రుసుము రూ. 200. విద్యార్థులు 15 ఆగస్ట్ 2024లోపు నమోదు చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్లాట్ 50% తగ్గింపును కూడా పొందవచ్చు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments