Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీట్ యుజి 2024లో టాప్ స్కోరర్లుగా 15 మంది హైదరాబాద్‌కు చెందిన ఆకాష్ విద్యార్థులు

Advertiesment
Akash Students

ఐవీఆర్

, బుధవారం, 5 జూన్ 2024 (23:11 IST)
టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామి అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్), ప్రతిష్టాత్మకమైన నీట్ యుజి 2024 పరీక్షలో హైదరాబాద్‌కు చెందిన 15 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చేశారని సగర్వంగా వెల్లడించింది. ఈ విద్యార్థులలో అధికశాతం మంది 679, అంతకంటే ఎక్కువ స్కోర్‌లు సాధించారు. ఈ అద్భుతమైన ఫీట్ వారి కృషి, అంకితభావం, ఏఈఎస్ఎల్ అందించిన అధిక-నాణ్యత కలిగిన కోచింగ్‌కు నిదర్శనం. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.
 
అనురన్ ఘోష్ 716 స్కోర్ చేయడం ద్వారా ఆల్ ఇండియా ర్యాంక్ ( ఏఐఆర్)77, సాయి ప్రణవ్ లకినపల్లి 711 స్కోర్ చేయడం ద్వారా ఏఐఆర్ 306 , రిజ్వాన్ షేక్ 710 స్కోర్ చేయడం ద్వారా ఏఐఆర్ 549, జయంత్ 706 స్కోర్ చేయడం ద్వారా ఏఐఆర్ 755, అరూష్ దధీచ్ 705 స్కోర్ చేయడం ద్వారా ఏఐఆర్ 1391, కె సర్వజ్ఞ 705 స్కోర్ చేయడం ద్వారా ఏఐఆర్ 856 సాధించటంతో పాటుగా మరెంతో మంది విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. 
 
విద్యార్థులు నీట్ కోసం సిద్ధం కావడానికి ఏఈఎస్ఎల్ యొక్క తరగతి గది ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలలో ఒకటిగా నీట్ పరిగణించబడుతుంది. తమ అద్భుతమైన విజయానికి కాన్సెప్ట్‌ల పట్ల మెరుగైన అవగాహన, క్రమశిక్షణతో కూడిన అధ్యయన షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించడం వల్లనే సాధ్యమైనదని వారు వెల్లడించారు. "ఆకాష్ మాకు రెండు విధాలా సహాయం చేసినందుకు మేము కృతజ్ఞులం. ఏఈఎస్ఎల్ కంటెంట్, కోచింగ్ లేకుండా, మేము తక్కువ సమయంలో వివిధ సబ్జెక్టులలో అనేక కాన్సెప్ట్ల ను గ్రహించలేము" అని విద్యార్థులు తెలిపారు.
 
అసాధారణ విజయాన్ని సాధించినందుకు విద్యార్థులను అభినందించిన, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) చీఫ్ అకడమిక్, బిజినెస్ హెడ్ శ్రీ ధీరజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, "విద్యార్థులు సాధించిన ఆదర్శప్రాయమైన ఫీట్‌కి మేము వారిని అభినందిస్తున్నాము. 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ 2024కి హాజరయ్యారు. వీరు సాధించిన విజయం, వారి కృషి, అంకితభావంతో పాటు వారి తల్లిదండ్రుల మద్దతు గురించి ఎంతో చెబుతుంది. భవిష్యత్ లో వీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని అభిలషిస్తున్నాను" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్మా పద్మనాభం అంటున్నారట: పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని ఇబ్బందుల్లో ముద్రగడ