chinni krishna-pawan, balayya,
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తెలుగు సినిమా రైటర్ చిన్నికృష్ణ కూటమి అభ్యర్ధులకు అభినందనలు తెలియచేశారు. ఆయా కూటమి అభ్యర్ధుల ముఖ్యనేతలు నారా చంద్రబాబు నాయుడుగారు, పురంధరేశ్వరిగారు, మా చిరంజీవి తమ్ముడు పవన్‌కల్యాణ్ గారు ప్రతి ఒక్కరిని పేరుపేరునా అభినంధిస్తున్నా అన్నారు.
ముఖ్యంగా మా పవన్‌కల్యాణ్ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సార్ మీ విజయం చలనచిత్ర పరిశ్రమే కాదు ప్రపంచంలోని తెలుగు యువత అంతా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుంది. రాబోయే రోజల్లో మీరు మరిన్ని శిఖరాగ్రాలను అందుకుని దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించాలి మనసారా ఆశిస్తున్నా అన్నారు.