Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్నయ విశ్వవిద్యాలయంలో జాబ్ మేళా.. ఉద్యోగ ఖాళీలు 3500

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (12:34 IST)
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఆగస్టు ఆరో తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, ప్రముఖ కంపెనీలలో సుమారు 3500 ఉద్యోగావకాశాలు ఉన్నాయని దీనిని సద్వినియోగం చేసుకోవాలని రిజిష్ట్రార్ ఆచార్య ఎస్.టేకి తెలిపారు. విశ్వవిద్యాలయంలో మంగళవారం మేగా జాబ్ మేళాకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. 
 
మాజీ మంత్రి జక్కపూడి రామ్మోహన్ రావు జయంత్రి సందర్భంగా జక్కపూడి రామ్మోహన్ రావు పౌండేషన్, సంహిత ఎడ్యుకేషనల్ సొసైటి ఆధ్వర్యంలో వికాస సంస్థలు కలిసి ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనికి ముఖ్య అతిథులుగా వీసీ ఆచార్య ఏ.వీ.ప్రసాదరావు, స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అన్నారు. 
 
ఆగస్టు ఆరో తేదీన ఉదయం 8 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభం అవుతుందని తెలిపారు. మధ్యాహ్నం భోజన ఏర్పాటు చేయాడం జరిగిందన్నారు. దీనిలో ప్రముఖ కంపెనీలు టెక్ మహేంద్రా, ఇండియామార్ట్, టిసిఎస్, మల్టీప్లైస్ ఇన్ సోలుషన్స్, హెచ్.డి.ఎఫ్.సి, ఎక్సిస్ బ్యాంక్, మిడ్మాప్, బిక్.సి, రైటర్స్ కార్పోరేషన్, టెలిపర్ఫామెన్స్, స్విగ్గ్, టాటాస్రైవె, ఇండిగో ఎయిర్లైన్స్, బిక్ బాస్కెట్, ఐ.ప్రోసస్, వసుధఫార్మ, అపోలో ఫార్మసి, శ్రీకృష్ణఫార్మ, మెట్రో ట్రైన్, బి.ఎస్.సి.పి.ఎల్, ఎఫక్ట్రానిక్స్, ఇన్టెల్నెట్ గ్లోబల్ సర్వీసిస్, ఫ్లిప్కార్ట్, కార్వే వంటి వాటిలో సుమారు 3500 ఉద్యోగావకాశాలు ఉన్నాయని చెప్పారు. 
 
పదో తరగతి నుండి పీజీ వరకూ అందరూ అర్హులేనని విద్యార్హతలను బట్టి ఆయా ఉద్యోగాలను ఎంపిక చేసుకోవచ్చునని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని కళాశాలలకు జాబ్ మేళాకు సంబంధించిన సమాచారాన్ని అందించామని చెప్పారు. నిరుద్యోగులైన ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments