చందానగర్‌లో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ కొత్త సెంటర్

ఐవీఆర్
శుక్రవారం, 20 జూన్ 2025 (19:45 IST)
చందానగర్: నీట్ & జెఇఇ పరీక్షల సన్నాహక సేవలలో జాతీయ అగ్రగామి అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఇఎస్ఎల్), చందానగర్‌లో తమ కొత్త సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి నియోజక వర్గ ఎంఎల్ఏ శ్రీ అరికెపూడి గాంధీ హాజరుకాగా శ్రీ అమీత్ కుమార్ ఉరిటి  (స్టేట్ హెడ్), శ్రీ నిశాంత్ శ్రీవాస్తవ, ఆపరేషన్ లీడ్, ఏపీ & టీజీ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్  లిమిటెడ్ కూడా పాల్గొన్నారు.
 
ఈ నూతన క్లాస్ రూమ్ కేంద్రం మెడికల్- ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. నీట్, జెఇఇ కోచింగ్‌తో పాటు, ఈ కేంద్రం ఒలింపియాడ్‌ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి, వారి విద్యాపరమైన ఫౌండేషన్ బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఫౌండేషన్-స్థాయి కోర్సులను కూడా అందిస్తుంది.
 
ఈ ప్రారంభం గురించి ఎఇఎస్ఎల్ చీఫ్ అకడమిక్ & బిజినెస్ హెడ్ ధీరజ్ మిశ్రా మాట్లాడుతూ, "చందానగర్‌లో మా కొత్త కేంద్రాన్ని ప్రారంభించటం పట్ల సంతోషంగా ఉన్నాము. ఇది విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్‌ను మరింత చేరువ చేయాలనే మా లక్ష్యంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. ఈ కేంద్రం అనుభవజ్ఞులైన అధ్యాపకులు, సమగ్ర అధ్యయన సామగ్రి, విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచడానికి రూపొందించబడిన అభ్యాస వాతావరణాన్ని కలిగి ఉంది. ప్రతి విద్యార్థి ఉత్తమ విద్య, వనరులకు అర్హులని మేము విశ్వసిస్తున్నాము. ఈ విస్తరణ ఆ లక్ష్యం పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది" అని అన్నారు. 
 
ఈ విస్తరణతో, AESL ఈ ప్రాంతంలోని ఎక్కువ మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరింత మంది ఔత్సాహిక విద్యార్థులు ప్రసిద్ధి చెందిన ఆకాష్ ఇన్‌స్టిట్యూట్ యొక్క అధిక-నాణ్యత కోచింగ్‌ను పొందగలరని నిర్ధారిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

Sri Vishnu : ప్రతి యువకుడి కథ.. ట్యాగ్‌లైన్‌తో శ్రీవిష్ణు హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

Rashmika: రష్మిక తో బోల్డ్ సినిమా తీశా - రేటింగ్ ఒకటిన్నర ఇస్తారేమో : అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments