Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు శుభవార్త.. డిసెంబర్ చివరి నాటికి 50వేల ఉద్యోగాలు

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (10:39 IST)
కరోనా వైరస్ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కూడా చతికిలపడింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో డిసెంబర్ చివరి నాటికి 50 వేల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రావొచ్చనే అంచనాలున్నాయి. 
 
మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్లు పెంచడం కోసం మోదీ సర్కార్ 2020 ఏప్రిల్ 1న పీఎల్‌ఐ స్కీమ్ తీసుకువచ్చింది. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రెసిడెంట్ పంకజ్ మహీంద్రో మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో 1,100 శాతం పెరుగుదల నమోదైందని చెప్పారు.
 
దీనివల్ల దేశీ అవసరాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఉత్పత్తి చేస్తున్నామని పంకజ్ వివరించారు. డిసెంబర్ నాటికి ప్రత్యేక్షంగానే 50 వేల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. ఇకపోతే.. దేశీ, అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు (ఫాక్స్‌కాన్, విస్ట్రోన్, శాంసంగ్, డిక్సన్, లావా వంటివి) దేశంలో మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. 
 
ఇంకా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్‌టివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ కింద స్మార్ట్‌ఫోన్ కంపెనీలు దేశంలో తయారీని పెంచుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో చాలా మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments