Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ విద్యా విధానం ఏది? విద్యార్థినీవిద్యార్థుల పరిస్థితి ఎలా వుంది?

సంవత్సరాలు ఒకదాని తర్వాత ఒకటి కదిలిపోతుంటాయి. సంవత్సరాలు మారుతున్నట్లే విద్యా విధానం మారిపోతోంది. విద్యార్థినీవిద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. పిల్లలు చదువుల యంత్రాలుగా చూస్తున్నారు. ఈ పద్థతి మారాల్సి వుంది. చదువు ఒక్కటే కాదు, ఇతర విషయాలపైన వారి

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (13:20 IST)
సంవత్సరాలు ఒకదాని తర్వాత ఒకటి కదిలిపోతుంటాయి. సంవత్సరాలు మారుతున్నట్లే విద్యా విధానం మారిపోతోంది. విద్యార్థినీవిద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. పిల్లలు చదువుల యంత్రాలుగా చూస్తున్నారు. ఈ పద్థతి మారాల్సి వుంది. చదువు ఒక్కటే కాదు, ఇతర విషయాలపైన వారికి అవగాహన కల్పించాలి.  
 
1. ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న బోధనా పద్ధతులను ఎప్పటికప్పుడు సమీక్షించాలి.
 
2. విద్యార్థుల మానసిక పరిస్థితులను కూడా తనిఖీ చేయాలి.
 
3. ర్యాంకింగ్ పద్ధతికి స్వస్తి చెప్పాలి.
 
4. గ్రేడింగ్ పద్ధతి వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది.
 
5. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే అనే మనస్తత్వం నుంచి బయటకు రావాలి.
 
6. హాస్టల్ గదులలో చదువుకునే విద్యార్థినీవిద్యార్థులకు వారివారి వ్యాపకాలు ఏవిధంగా వున్నాయన్నది చూడాలి.
 
7. పాఠశాలలు పిల్లలను విహారయాత్రలకు తీసుకుని వెళుతుంటే మనసుకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. 
 
8. ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహించాలి.
 
9. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యా విధానాలపై సమీక్షలు చేసి తగిన మార్గనిర్దేశకాలు ఇస్తుండాలి.
 
10. నిబంధనలకు అనుగుణంగా కళాశాలలు పనిచేస్తున్నాయా లేదా అన్నది తనిఖీ చేసుకుంటూ వుండాలి.
 
ఇక మన తెలుగు రాష్ట్రాల గురించి చూసినప్పుడు... ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థినీవిద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీనితో పలు కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనిపై గట్టిచర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. దీనిపై దృష్టి పెట్టామని, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని, ఒక కమిటీని కూడా నియమించామని ఆ కమిటీ 730 కాలేజీలు తనిఖీ చేశారని చెప్పారు. కాలేజీ సమయాలు, క్రీడల సమయం, సైకాలజిస్ట్‌ల నియామకం వంటి అంశాల్లో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 
 
ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అనుమతి లేకుండా 158 హాస్టళ్లు ఏర్పటు చేశారని, అయితే విద్యార్థుల విద్యా సంవత్సరానికి ఇబ్బంది లేకుండా ఈ ఏడాది వరకు వాటిని అనుమతిస్తున్నట్లు తెలిపారు. 
 
గత నెలలో జరిపిన అమెరికా  పర్యటనలో తెలుగు విద్యార్థులకు ప్రయోజనకరమైన పలు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. అక్కడి ఒహాయో  విశ్వవిద్యాలయంతో చేసుకున్న ఒప్పందం వల్ల తెలుగు విద్యార్థులకు ఏడాదికి రూ.400 కోట్ల వరకు ఆదా అవుతుందని వివరించారు. రాష్ట్రంలో వెయ్యి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. రైట్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయంతో కూడా ఒప్పందం ఖరారైనట్లు  ఆయన తెలిపారు. ఆ యూనివర్సిటీ వారు వచ్చే నెలలో మన రాష్ట్రంలో పర్యటిస్తారని, భోగాపురంలో గాని, అమరావతిలో గాని వారు కేంపస్ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments