ఉద్యోగం లేదా? ఫేస్ బుక్, ట్విట్టర్లలో ఇలాంటి డిస్కషన్సా? ఐతే అందువల్లే రావడంలేదు...
నిరుద్యోగ యువత పడే కష్టం వర్ణించలేనిది. డిగ్రీ పట్టా పుచ్చుకునేవరకూ తల్లిదండ్రుల చాటున బిడ్డల్లా బ్రతికిన వీరికి డిగ్రీ పూర్తి కాగానే ఇక ఉద్యోగ వేట మొదలవుతుంది. ఇదివరకూ ఎవరో తెలిసిన వారిని పట్టుకుని బ్రతిమాలుకుంటూ ఎలాగో ఉద్యోగాలు సంపాదించేవారు. కానీ
Publish Date: Mon, 10 Apr 2017 (17:28 IST)
Updated Date: Mon, 10 Apr 2017 (17:30 IST)
నిరుద్యోగ యువత పడే కష్టం వర్ణించలేనిది. డిగ్రీ పట్టా పుచ్చుకునేవరకూ తల్లిదండ్రుల చాటున బిడ్డల్లా బ్రతికిన వీరికి డిగ్రీ పూర్తి కాగానే ఇక ఉద్యోగ వేట మొదలవుతుంది. ఇదివరకూ ఎవరో తెలిసిన వారిని పట్టుకుని బ్రతిమాలుకుంటూ ఎలాగో ఉద్యోగాలు సంపాదించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
ఉద్యోగం కోసం అలా అప్లై చేయగానే వారిని ఉద్యోగంలోకి తీసుకోవడమా లేదా అనేది యాజమాన్యాలకు చాలా సులభమైపోయిందట. అదెలా? అనుకుంటున్నారా..? మరేం లేదు. ఇప్పటి యూత్ ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు లేకుండా ఉండటం లేదు కదా. ఇవే నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలా వద్దా అని చెప్పేస్తున్నాయట. ఉద్యోగం రాకపోవడానికి క్రింది సూచించినవే కారణాలవుతున్నాయని తేలింది.
1. ఆగ్రహంతోనూ, అసహజమైన భాషా ప్రయోగం. 75 శాతం ఈ కారణంతోనే ఉద్యోగం ఇవ్వడంలేదట.
2. మాదక ద్రవ్యాల గురించి చర్చ. 71 శాతం ఈ కారణంతోనే ఉద్యోగం ఇవ్వడంలేదట.
3. అచ్చు తప్పులు, వాక్య నిర్మాణంలో దోషాలు. 56 శాతం ఈ కారణంతోనే ఉద్యోగం ఇవ్వడంలేదట.
4. మందుతో మజా చేస్కున్నట్లు ఫోటోలు. 47 శాతం ఈ కారణంతోనే ఉద్యోగం ఇవ్వడంలేదట.
5. రాజకీయాలపై విశ్లేషణలు, యాక్టివిటీ. 29 శాతం ఈ కారణంతోనే ఉద్యోగం ఇవ్వడంలేదట.
6. ఇతర సమాచారం గురించి.. లింకులు, ఫోటోలు. 29 శాతం ఈ కారణంతోనే ఉద్యోగం ఇవ్వడంలేదట.
7. ఇబ్బడిముబ్బడిగా సెల్ఫీలు, ఫోటోలు. 26 శాతం ఈ కారణంతోనే ఉద్యోగం ఇవ్వడంలేదట.
8. ఇతర కారణాలతో 6 శాతం ఉద్యోగం ఇవ్వడంలేదట.
9. కేవలం 4 శాతం మాత్రం ఇందుకు మినహాయింపు. వారు ఎందుకు ఇవ్వడం లేదన్నది మాత్రం చెప్పరు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
Read More