Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైపుణ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్న భారతీయులు: గ్రేట్ లెర్నింగ్ గ్లోబల్ అప్‌స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2023

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (23:08 IST)
అగ్రగామి ఎడ్ టెక్ ప్లాట్ ఫామ్ అయిన గ్రేట్ లెర్నింగ్, భారతీయ ఎడిషన్ ప్రచురణ అనంతరం, తన ‘అప్ స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2023’ అంతర్జాతీయ ఎడిషన్ ను విడుదల చేసింది. తాజా ఎడిషన్ 2023లో, ప్రజల అప్ స్కిల్లింగ్ ఎంపికలను ప్రభావితం చేసే ప్రపంచవ్యాప్త ధోరణులను మరీ ముఖ్యంగా నాలుగు కీలక మార్కెట్లయిన అమెరికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియాలోని వాటిని (ఈ ప్రాంతాల్లో అప్‌స్కిల్లింగ్ కోర్సులకు ఉన్న గరిష్ఠ డిమాండ్ ఆధారంగా) వెల్లడిస్తుంది. నైపుణ్యాలను పెంచుకోవడం వెనుక ఉద్దేశాలు, అప్ స్కిల్ అయ్యేందుకు ప్రజలకు ప్రేరణ కలిగించే అంశాలు, నైపుణ్యాలను పెంచుకోవడంలో ఎదురవుతున్న అడ్డంకులు, అప్‌స్కిల్లింగ్‌ను ప్రారంభించడంపై కార్యాలయాల ప్రభావం వం టి అంశాలపై ఈ నివేదిక వెలుగులు ప్రసరిస్తుంది. గ్రేట్ లెర్నింగ్ యొక్క అభ్యాసకుల ప్రవర్తనలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ నమూనా సమ్మేళనం ఆధారంగా ఈ ధోరణులు గుర్తించబడ్డాయి.
 
ప్రపంచవ్యాప్తంగా ఇతరులతో పోలిస్తే, భారతదేశంలో మరెంతో మంది ప్రొఫెషనల్స్ భవిష్యత్ సన్నద్ధక కెరీర్ల కోసం అప్ స్కిల్లింగ్‌ను ఎంతో ముఖ్యమైందిగా భావిస్తున్నారు. భారతదేశంలో 85% మంది ప్రొఫెషనల్స్ భవిష్యత్ సన్నద్ధక కెరీర్ల కోసం అప్‌స్కిల్లింగ్ ఎంతో ముఖ్యమైందిగా భావిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే, సగటున 76% ప్రొఫెషనల్స్ మాత్రమే అప్ స్కిల్లింగ్‌ను ముఖ్యమైందిగా భావిస్తున్నారు.
 
భవిష్యత్ సన్నద్ధక కెరీర్ల విషయానికి వస్తే, 84% మంది ఆగ్నేయాసియా ప్రొఫెషనల్స్, లాటిన్ అమెరికా నుంచి 76% మంది ప్రొఫెషనల్స్ అప్ స్కిల్లింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి విరుద్ధంగా, అమెరికా వంటి మరింతగా అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన ప్రొఫెషనల్స్ లో 64% మంది, పశ్చిమాసియా లో 66% మంది భవిష్యత్ సన్నద్ధక కెరీర్ల కోసం అప్ స్కిల్లింగ్‌ను ముఖ్యమైందిగా భావిస్తున్నారు. 2023లో 83% మంది భారతీయ ప్రొఫెషనల్స్ అప్ స్కిల్ కావాలని భావిస్తుండగా, అంతర్జాతీయంగా ఇది 74%గా మాత్రమే ఉంది.
 
ధోరణులను అనుసరించి చూస్తే, భారతదేశంలో 83% మంది ప్రొఫెషనల్స్ ఈ ఏడాది అప్ స్కిల్ కావాలని యోచిస్తున్నా రు. అదే సమయంలో పరిపక్వతగల మార్కెట్ అయినప్పటికీ అమెరికాలో 47% మంది ప్రొఫెషనల్స్ మాత్రమే అప్‌స్కిల్ కావాలని భావిస్తున్నారు. పశ్చిమాసియా, ఆగ్నేయా సియా, లాటిన్ అమెరికా లాంటి ప్రాంతాల్లో 2023లో అప్‌స్కిల్ కావాలని భావిస్తున్న ప్రొఫెషనల్స్ శాతాలు వరుసగా 79%,77% మరియు 80%గా ఉన్నాయి. 71% మంది భారతీయ ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాలను నిలబెట్టుకోగలమని ఆత్మవిశ్వాసంతో ఉండగా, అంతర్జాతీయంగా ఇది 59%గా ఉంది.
 
స్థూల ఆర్థిక పరిస్థితుల్లోని అనిశ్చితిల నేపథ్యంలో 2023లో తమ ఉద్యోగాలను నిలబెట్టుకునే విషయంలో భారతీయ సిబ్బంది, ప్రొఫెషనల్స్ కనబర్చిన ఆశావాదానికి పూర్తి భిన్నంగా అంతర్జాతీయ మార్కెట్లు ఈ విషయంలో తక్కువ విశ్వాసంతో ఉన్నాయి. భారతదేశంలో 71% మంది ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాలను నిలబెట్టుకునే విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉండగా, అంతర్జాతీయంగా ఇది 59%గా ఉంది. ఈ ఏడాది తమ ఉద్యోగాలను నిలబెట్టుకునే విషయంలో అంతర్జాతీయంగా చూస్తే లాటిన్ అమెరికా అత్యంత తక్కువ శాతాన్ని (44%) కలిగి ఉంది. అమెరికాలో 59% మంది తమ ఉద్యోగాలను నిలబెట్టుకునే విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఈ శాతం ఆగ్నేయాసియాలో 60%గా, పశ్చిమాసియాలో 50%గా  ఉంది.
 
 
అప్‌స్కిల్ కావడంలో అదే సంస్థలో కెరీర్ వృద్ధి మరియు వ్యక్తిగత ఆసక్తులు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అమెరికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, భారతదేశం, పశ్చిమాసియాలలో అప్ స్కిల్ కావడంలో ప్రొఫెషనల్స్‌కు ప్రేరణ కలిగించే అంశాల్లో అదే సంస్థలో కెరీర్ వృద్ధి అనేది ప్రధాన కారణంగా ఉంది. వ్యక్తిగత ఆస్తులు అనేది ఈ ప్రాంతాల్లోని ప్రొఫెషనల్స్‌లో రెండో కారణంగా నిలిచింది. కొత్త ఉద్యోగాన్ని పొందడం అనేది తరువాతి స్థానంలో నిలిచింది. అప్‌స్కిల్ అయ్యే విషయంలో కార్యాలయాల ప్రభావం ఎలా ఉందన్న ప్రశ్నకు, అప్ స్కిల్ కావాలన్న తమ నిర్ణయాన్ని కార్యాలయాలు ప్రభావితం చేస్తాయని అంతర్జాతీయంగా 59% మంది ప్రొఫెషనల్స్ భావించారు. అమెరికాలో 39% మంది ప్రొఫెషనల్స్ మాత్రమే కార్యాలయం తమ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. భారతదేశంలో ఇలా చెప్పినవారు 67%గా ఉన్నారు. ఆగ్నేయాసిలో వీరు 60%గా, లాటిన్ అమెరికాలో 57%గా, పశ్చిమాసియాలో 57%గా ఉన్నారు.
 
భారతదేశం, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలలో ఆఫీస్ వర్క్ అనేది ప్రొఫెషనల్స్‌ను అప్‌స్కిల్ కాకుండా ఉంచుతుండగా, అమెరికా, పశ్చిమాసియాలలో కుటుంబ బాధ్యతలు అనేవి ప్రొఫెషనల్స్ అప్‌స్కిల్ కావడంలో ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. అప్‌స్కిల్ కావడంలో అమెరికా విషయానికి వస్తే, ‘కుటుంబంతో బిజీగా ఉండడం’, ‘అందుబాటు’ అనే అంశాలను తాము ఎదుర్కొంటున్న సవాళ్లుగా ప్రొఫెషనల్స్ చెబుతున్నారు. ఆగ్నేయాసియాలో ‘అందుబాటు’ మరియు ‘ఆఫీస్ పనితో బిజీగా ఉండడం’ అనే అంశాలు ప్రొఫెషనల్స్‌కు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. పశ్చిమా సియాలోని ప్రొఫెషనల్స్ తమ కుటుంబ బాధ్యతలను అప్ స్కిల్ కావడానికి ప్రధాన అవరోధంగా భావిస్తు న్నారు. లాటిన్ అమెరికాలో ఎంతోమంది ప్రొఫెషనల్స్ ‘ఆఫీస్ వర్క్‌తో బిజీగా ఉండడం’ను అప్ స్కిల్ కావడంలో ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. ఆగ్నేయాసియా విషయానికి వస్తే అక్కడి మహిళలు అప్‌స్కిల్ అయ్యేందుకు ‘అందుబాటు’ మరియు ‘ఆఫీస్ వర్క్’ అనేవి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. ఇతర ప్రాంతాల విషయానికి వస్తే కుటుంబ బాధ్యతలు, ఇంటిపనులు లాంటివి మహిళలను అప్‌స్కిల్ కావడానికి దూరంగా ఉంచుతున్నాయి
 
ఈ సందర్భంగా ఈ నివేదిక గురించి గ్రేట్ లెర్నింగ్ సహ వ్యవస్థాపకులు అర్జున్ నాయర్ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత ఆర్థిక వాతావరణం, సంప్రదాయ ఉద్యోగాలు కొత్తవాటితో భర్తీ కావడం, అధునాతన ఉద్యోగాలు లాంటివి ప్రొఫెషనల్స్‌లో వారు అత్యధిక స్థాయిలో పోటీపడాలని భావించేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్ స్కిల్లింగ్ ఉద్దే శాలు, అప్‌స్కిల్ కావడానికి ప్రేరణ, ప్రస్తుతం డిమాండ్ లో ఉన్న నైపుణ్యాలు లాంటి మరెన్నో అంశాల గురించి ది గ్లోబల్ అప్‌స్కిల్లింగ్ ట్రెండ్స్ 2023 నివేదిక సరికొత్త వెలుగులను ప్రసరింపచేస్తుంది. అంతర్జాతీయంగా చూస్తే 74% మంది ప్రొఫెషనల్స్ అప్‌స్కిల్ కావాలని భావించడాన్ని చూస్తే, ఈ డిమాండ్ ఇప్పటికే బలంగా ఉందని, అది మరింత పెరుగుతోందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments