ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూపు-4 ఫిలిమ్స్ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తాజాగా విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 11,574 మంది అర్హత సాధించారు. మొత్తం 2,11,341 మంది ఈ పరీక్షకు హాజరైనట్టు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్ర రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్సెంట్ పోస్టుల భర్తీ కోసం గ్రూపు-4 ప్రిలిమ్స్ ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. గత జూలై 31వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను బుధవారం రాత్రి విడుదల చేసింది.
ఇందులో మొత్తం 2,11,341 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, మెయిన్ పరీక్షకు 11574 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు తెలిపింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది.