Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటి కొనండి ఒకటి ఉచితంగా పొందండి ఆఫర్‌తో ఇంజనీర్స్ డేను వేడుక చేస్తున్న వండర్‌లా

ఐవీఆర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (19:04 IST)
భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్, ఇంజనీర్స్ డే వేడుకలను ప్రత్యేకమైన 'ఒకటి కొనండి  ఒకటి ఉచితంగా పొందండి ఆఫర్‌'తో నిర్వహిస్తుంది. దీనితో పాటుగా సెప్టెంబర్ 15, 2024 నాడు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం ప్రత్యేకంగా  ఉత్తేజకరమైన కార్యకలాపాలు కూడా  ఇంజనీర్స్ డే వేడుకలలో భాగంగా చేస్తున్నారు.  

మన దేశంలోని మహోన్నత మేధావులను అభినందిస్తూ , టిక్కెట్‌లపై 'ఒకటి కొనండి ఒకటి ఉచితంగా  పొందండి' డీల్‌ను వండర్‌లా అందిస్తోంది, ఇది వండర్‌లా బెంగళూరు మరియు హైదరాబాద్ పార్కులలో ఆన్‌లైన్ బుకింగ్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ఇంజనీరింగ్ విద్యార్థులు, డిగ్రీ హోల్డర్లు, డిప్లొమా హోల్డర్లు మరియు ఐటిఐ  సర్టిఫికేషన్ ఉన్న వారందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ను పొందేందుకు, వారు  తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే విద్యార్థి ఐడి  లేదా ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్‌ను ధృవీకరణ కోసం పార్క్‌కు అందించాల్సి ఉంటుంది.

ఇంజనీర్స్ డే వేడుకల్లో భాగంగా, ఉత్కంఠభరితమైన రైడ్‌లు, ప్రత్యేక ఆహార సమర్పణలు మరియు మరిన్నింటితో వినోద శ్రేణికి జోడించి, ఈ రోజును మరపురాని అనుభూతిగా మార్చే ఒక ఉత్తేజకరమైన డీజే  పార్టీ కూడా ఉంటుంది. ఈ సందర్భంగా వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలపిల్లి మాట్లాడుతూ, “ భవిష్యత్తును నిర్మించడంలో మన ఇంజనీర్లు చేసిన కృషి మరియు చూపుతున్న అంకితభావానికి వండర్‌లా వద్ద మేము చాలా విలువ ఇస్తున్నాము. ఈ వ్యక్తులు రేపటి ఆవిష్కర్తలు మరియు సమస్యలకు పరిష్కారాలు అందించే మేధావులు. వారికి కొద్ది పాటి మానసికోల్లాసం అవసరమని మేము నమ్ముతున్నాము.

ఈ ఆఫర్ వారి సహకారం మరియు ప్రయత్నాలను గుర్తించి, వారు విశ్రాంతిని పొందేందుకు, తమ తోటివారితో బంధాన్ని ఏర్పరచుకోవడానికి మరియు శాశ్వతమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి కల్పిస్తున్న మాదైన హృదయపూర్వక మార్గం. వండర్‌లా వద్ద గడిపే ఒక రోజు, వారి బిజీ కెరీర్‌ల నుండి మరియు అభ్యాస విధానాల నుంచి పక్కకు తొలగడానికి  మరియు మరపురాని అనుభవాలతో తమను తాము రీఛార్జ్ చేసుకోవటానికి వీలు కల్పిస్తూ వినోదం, విశ్రాంతి మరియు ఉత్సాహం యొక్క ఖచ్చితమైన సమ్మేళనంను అందిస్తుందని మేము ఆశిస్తున్నాము" అని అన్నారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments