Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రత్యేక ఆఫర్‌తో పురుషుల దినోత్సవాన్ని వేడుక చేస్తున్న వండర్‌లా హాలిడేస్

image
, గురువారం, 16 నవంబరు 2023 (22:56 IST)
భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్, వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్, అడల్ట్స్‌కీ ఈ పురుషుల దినోత్సవాన్ని నిజంగా ప్రత్యేకంగా చేయడానికి సిద్ధమైంది. ఒక ప్రత్యేకమైన మరియు ఉత్తేజకరమైన ఆఫర్‌లో భాగంగా థ్రిల్లింగ్ అడ్వెంచర్‌లు, రుచికరమైన ఆహారం మరియు మరపురాని జ్ఞాపకాలతో కూడిన రోజుగా మలుచుకోవటానికి పురుషులందరినీ వండర్‌లా ఆహ్వానిస్తుంది. నవంబర్ 19, 2023న, వండర్‌లా హాలిడేస్ బెంగళూరు, కొచ్చి మరియు హైదరాబాద్‌లోని మూడు ప్రసిద్ధ పార్కులలో పురుషుల కోసం ప్రత్యేకంగా '1 టికెట్ కొనండి, 1 ఉచితం గా పొందండి ' డీల్‌ను అందజేస్తుంది. ఈ ఆఫర్‌ను పొందడానికి, అతిథులు తమ టిక్కెట్‌లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఈ ప్రత్యేకమైన ఆఫర్ మన జీవితాల్లో పురుషులు అందించిన సహకారం మరియు విజయాలకు నివాళి.  మీ పురుష స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు సహోద్యోగులను గౌరవించడానికి సరైన సందర్భంగా వండర్‌లాకు అద్భుతమైన యాత్రను ప్లాన్ చేయడం నిలుస్తుంది.  మీ స్నేహితులను సమీకరించండి, ఆహ్లాదం, ఉత్సాహం మరియు ప్రతిష్టాత్మకమైన క్షణాలతో నిండిన ప్రయాణాన్ని ప్రారంభించండి. అదనంగా, వండర్‌లా పురుషుల దినోత్సవం రోజున ప్రత్యేక పోటీలను నిర్వహిస్తోంది. ఇక్కడ పురుషులు పోటీలో పాల్గొనవచ్చు మరియు బెంగళూరు, కొచ్చి లేదా హైదరాబాద్ పార్కులకు ఉచిత టిక్కెట్లను పొందవచ్చు.
 
ఈ పోటీలో భాగంగా, వండర్‌లా ప్రతి పార్క్‌లో ఎంట్రీ పాయింట్‌కు ముందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తోంది మరియు ఆకట్టుకునే రీతిలో ప్రదర్శనలను చేసిన మొదటి 100 మంది అభ్యర్థులకు ఉచిత టిక్కెట్‌లను గెలుచుకునే అవకాశం అందిస్తుంది. నిర్దేశిత సమయ వ్యవధిలో వారి ప్రదర్శన ఆధారంగా ఉచిత టిక్కెట్లు అందించబడతాయి. వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలప్పిల్లి పురుషుల దినోత్సవం సందర్భంగా తన ఆలోచనలను పంచుకుంటూ , ప్రతి ఒక్కరి జీవితాలకు గణనీయంగా తోడ్పడే పురుషులను అభినందించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. "వండర్‌లా వద్ద , మరచిపోలేని అనుభూతిని అందించే డీల్‌ను అందించడం ద్వారా పురుషులందరికీ ఈ రోజును ప్రత్యేకంగా మలచడమే తమ లక్ష్యం" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలయ్య కారును ఆపిన వైసీపీ కార్యకర్త... ప్లకార్డు పట్టుకుని?