Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయులు ఏ రంగు కారును ఇష్టపడుతారు?

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (10:38 IST)
సాధారణంగా చాలా మంది కార్లు కొనుగోలు చేసేటపుడు తమ జాతకరీత్యా ఏ రంగు అయితే సూటబుల్ అవుతుందో ఆ తరహా రంగు కారును కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతారు. కానీ, తాజాగా నిర్వహించిన సర్వేలో మాత్రం భారతీయులు ఎక్కువగా తెలుగు రంగు కారును ఇష్టపడతారని తేలింది. 
 
2018లో 43 శాతం మంది ఆ రంగునే ఎంచుకున్నారట. జర్మనీకి చెందిన రసాయన సంస్థ బీఏఎస్‌ఎఫ్ తన అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించింది. ఆ కంపెనీ బీఏఎస్‌ఎఫ్ కలర్‌ రిపోర్ట్ ఫర్ ఆటోమోటివ్ ఓఈఎం కోటింగ్స్ పేరుతో ఓ నివేదికను వెలువరించింది. 
 
తెలుపు తర్వాత గ్రే (15 శాతం), సిల్వర్ (15 శాతం) రంగులను ఎంపిక చేసుకున్నారని వెల్లడించింది. తర్వాత స్థానాల్లో ఎరుపు (9 శాతం), నీలం (7 శాతం), నలుపు (3 శాతం) రంగులను ఎంపిక చేసుకున్నారు. భారతీయ కొనుగోలుదారులు ముత్యపు రంగు (పర్ల్ వైట్‌)నే ఎంచుకుంటున్నారు. ఇక్కడి వాతారణం వేడిగా ఉండటం కూడా ఈ రంగును ఎంచుకోడానికి కారణమని పేర్కొంది. 
 
తెలుపు రంగు వల్ల కార్లు త్వరగా వేడెక్కవు. అలాగే ఆ రంగు విలాసవంతంగా కనిపించడం కూడా ఓ కారణం కావొచ్చు అని ఆ నివేదిక పేర్కొంది. స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) కార్ల విషయంలో కూడా 41 మంది ఈ రంగు వైపే మొగ్గు చూపుతున్నారు. అలాగే కాంపాక్ట్ సెగ్మెంట్‌, కాంపాక్ట్ ప్రీమియమ్ సెగ్మెంట్ల విషయంలో కూడా తెలుపుదే పైచేయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments