Webdunia - Bharat's app for daily news and videos

Install App

’చపలచిత్త’ ట్రంప్‌తో అమెరికాలో అపార అవకాశాలు: ఆనంద్‌ మహీంద్రా

’చపలచిత్తం’ గల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి మరిన్ని వ్యాపార అవకాశాలు తెరపైకి వచ్చాయని పారిశ్రామిక దిగ్గజం ఆ

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (04:33 IST)
’చపలచిత్తం’ గల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి మరిన్ని వ్యాపార అవకాశాలు తెరపైకి వచ్చాయని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఈ విశ్వాసంతోటే అమెరికాలో తమ పెట్టుబడులను రెట్టింపు స్థాయికి పెంచుకోనున్నట్లు ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.
 
‘నిజానికి ట్రంప్ ప్రకటించిన మేక్‌ అమెరికా గ్రేట్‌ విధానంతో పెట్టుబడులకు అద్భుతమైన కేంద్రంగా అమెరికా మరోసారి నిలవనుంది. స్టాక్‌మార్కెట్లు ఇప్పటికే పెరిగాయి. అక్కడ అపార వ్యాపార అవకాశాలు ఉన్నాయని విశ్వసిస్తున్నందున మేం అమెరికాలో పెట్టుబడులను రెట్టింపు చేయనున్నాం‘ అని ఆయన వివరించారు.
 
ట్రంప్ తన దేశమైన అమెరికాను పునర్నిర్మించాలనుకుంటున్నారే కాని ప్రపంచాన్ని కాదని ఆనంద్ మహేంద్ర అభిప్రాయ పడ్డారు. అమెరికా ఇప్పటికీ శక్తివంతమైన దేశమేనని ట్రంప్ మనందరినీ నిద్రలేపుతాడని, నూతన వ్యాపారావకాశాల అంచుమీద మనల్ని నిలబెడతాడని చెప్పారు. 
 
అంతకుముందే రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కూడా ట్రంప్ విధానాలు దేశీయ ఐటీ కంపెనీలకు మారురూపంలో ఉన్న ఆశీర్వాదం లాంటివని కొనియాడటం విశేషం. అమెరికా వంటి అతి పెద్ద మార్కెట్లో సమస్యలకు పరిష్కారాలపై భారతీయ ఐటీ పరిశ్రమ దృష్టి సారిస్తే ట్రంప్ విధానాలు మనకు నిజంగానే వరంలాగా మారతాయని ముఖేష్ నొక్కి చెప్పారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments