Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్డొస్తే పచ్చడైపోతారు... పేటీఎం సీఈఓ నోటిదూల... పెద్ద నోట్ల రద్దుతో రూ.కోట్ల ఆదాయంతో ఖుషీ

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు మాత్రం అష్టకష్టాలు పడుతుంటే.. బడబాబులు మరింత బడాబాబులై పోతున్నారు. ఈ కోవలం పేటీఎం సంస్థ కూడా ఒకటి. దేశంలో

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (06:24 IST)
దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు మాత్రం అష్టకష్టాలు పడుతుంటే.. బడబాబులు మరింత బడాబాబులై పోతున్నారు. ఈ కోవలం పేటీఎం సంస్థ కూడా ఒకటి. దేశంలో డీమోనిటైజేషన్ పుణ్యమాని ఈ సంస్థ గత నవంబర్ నుంచి కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో సంస్థ సీఈఓ విజయ్ శంకర్ శర్మ తమ సిబ్బందికి ప్రైవేట్‌గా ఒక పార్టీ ఏర్పాటు చేశారు. సంస్థ ఎదుగుదల, సిబ్బంది పనితీరు గురించి ఎంతో ఉత్సాహంగా ఆయన ప్రసంగించారు. అయితే, ఆ ఉత్సాహంలో కొంచెం శ్రుతి మించిన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగాన్ని ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో కాస్త ఇపుడు వైరల్‌గా మారింది. ఇంతకూ ఆయన ఏం మాట్లాడారో చూద్ధాం. 
 
తమ దారికి ఎవరైనా అడ్డొస్తే పక్కకు వెళ్లిపోవాలని, లేదంటే చచ్చిపోతారని అన్నారు. తమ సంస్థ చిన్న సైకిలు లేదా ఆటో లాంటి వాహనం కాదు. యుద్ధ ట్యాంక్‌తో సమానం. తమకు అడ్డొచ్చిన వాటిని యుద్ధ ట్యాంకు పచ్చడి చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతుంది అని ఓ రేంజ్‌లో నోటిదూలను ప్రదర్శించాడు. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు శర్మ శ్రుతిమించిన వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు కురిపిస్తున్నారు. కాగా, పేటీఎం కంపెనీకి చైనాకు చెందిన అలీబాబా కంపెనీ పెట్టుబడులు పెడుతోంది.

 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments