Webdunia - Bharat's app for daily news and videos

Install App

3.44 బిలియన్‌ డాలర్ల వాల్యుయేషన్‌ వద్ద 440 మిలియన్‌ డాలర్ల తాజా నిధులను సమీకరించిన అన్‌అకాడమీ

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (20:12 IST)
బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద అభ్యాస వేదిక అన్‌అకాడమీ నేడు తాము 440 మిలియన్‌ డాలర్లను సమీకరించినట్లు వెల్లడించింది. ఈ రౌండ్‌ ఫండింగ్‌కు టెమాసెక్‌ నేతృత్వం వహించగా జనరల్‌ అట్లాంటిక్‌, టైగర్‌ గ్లోబల్‌, సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ లు సైతం ప్రో-రేటా పద్ధతిలో పాల్గొన్నాయి. ఈ తాజా నిధుల సమీకరణతో అన్‌అకాడమీ గ్రూప్‌ విలువ 3.44 బిలియన్‌ డాలర్లకు చేరింది.
 
సిరీస్‌ హెచ్‌ ఫండింగ్‌ రౌండ్‌లో అరోవా వెంచర్స్‌ సైతం పాల్గొంది. ఓయో వ్యవస్థాపకుడు రితేష్‌ అగర్వాల్‌ మరియు జొమాటో కో-ఫౌండర్‌, సీఈవో దీపిందర్‌ గోయల్‌ యొక్క ఫ్యామిలీ ఆఫీస్‌ అరోవా వెంచర్స్‌. ఈ రౌండ్‌లో అన్‌అకాడమీ యొక్క కొన్ని ఏంజెల్‌ ఇన్వెస్టర్లు బయటకు వెళ్లిపోయారు.
 
గత 18 నెలల కాలంలో, అన్‌అకాడమీ గ్రూప్‌ యొక్క విలువ దాదాపుగా 10 రెట్లు పెరిగింది. భారతదేశంలో మిడ్‌–స్టేజ్‌ కన్స్యూమర్‌ ఇంటర్నెట్‌ స్టార్టప్‌ సాధించిన అత్యధిక వృద్ధి రేటులలో ఇది ఒకటి. ఈ తాజా రౌండ్‌ జనవరి 2021లో టైగర్‌ గ్లోబల్‌, డ్రాగోనీర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌, స్టెడ్‌వ్యూ క్యాపిటల్‌ మరియు జనరల్‌ అట్లాంటిక్‌ లు సెకండరీ ట్రాన్స్‌శాక్షన్‌ ద్వారా తమ మునుపటి పెట్టుబడులను రెట్టింపు చేయడాన్ని అనుసరించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments