మరోమారు కొండెక్కిన బంగారం - ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే...

Webdunia
గురువారం, 8 జులై 2021 (11:55 IST)
దేశంలో మరోమారు బంగారం, వెండి ధరలు కొండెక్కాయి. ఒక రోజు తగ్గుతూ.. మరోరోజు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలుదార్లకు ఇది షాకింగ్‌గా వుంది. తాజాగా గురువారం కూడా పెరిగింది. 
 
బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు బంగారు ధరల వైపు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. అయితే వెండి ధర విషయానికొస్తే బంగారం పెరిగితే వెండి మాత్రం తగ్గుముఖం పట్టింది. తాజాగా సిల్వర్‌ ధర తగ్గింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో గురువారం ఉదయం నాటికి నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
 
దేశ రాజధాని ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,850 ఉంది. అలాగే, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 ఉంది.
 
ఇకపోతే, ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,970 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.
 
తెలుగు రాష్ట్రాలా రాజధానుల్లో ఒకటైన హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉండగా, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి నుంచి ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్‌ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు

తర్వాతి కథనం
Show comments