టిక్‌టాక్‌కు మరో షాక్.. హాంకాంగ్ మార్కెట్ నుంచి అవుట్

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (12:02 IST)
టిక్‌టాక్ ఇప్పటికే భారీ నష్టాలను చవిచూసింది. భారత మార్కెట్లో టిక్ టాక్ నిషేధానికి గురికావడంతో ఆ సంస్థకు భారీ నష్టం తప్పలేదు. తాజాగా హాంకాంగ్‌ మార్కెట్ నుంచి టిక్‌టాక్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 
 
ఇందుకు కారణం హాంకాంగ్ స్వ‌యంప్ర‌తిప‌త్తిని కాల‌రాస్తూ చైనా పార్ల‌మెంటు ఇటీవ‌లే జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టానికి ఆమోదం తెలపడమే. దీంతో అక్క‌డ నిరస‌న‌లు భ‌గ్గుమ‌న్నాయి. సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు చైనా తీరును ఎండ‌గడుతూ ఒకే తాటిపైకి వ‌స్తున్నారు.
 
దీనిపై క‌న్నెర్ర జేసిన ప్ర‌భుత్వం హాంకాంగ్‌లో నిర‌స‌న‌ల‌ను అణిచివేసేంచుకు టిక్‌టాక్ వినియోగాన్ని నిలిపివేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం టిక్‌టాక్ నిర్వాహ‌కుల‌తోనూ అక్క‌డి ప్ర‌భుత్వ అధికారులు సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. 
 
ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్ త‌న‌ కార్య‌క‌లాపాల‌ను హాంకాంగ్‌లో నిలిపివేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. అయితే ప్ర‌భుత్వ అభ్య‌ర్థ‌న‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేసింది. కేవ‌లం అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణ‌యానికొచ్చిన‌ట్లు వివ‌రించింది. ఈ చ‌ర్య‌తో 1,50,000 మంది యూజ‌ర్ల‌ను టిక్‌టాక్ కోల్పోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments