Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడైక్కెనాల్‌లో తామర కొడై లగ్జరీ రిసార్ట్స్ ప్రారంభం

ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న కొడైక్కెనాల్‌లో తామర కొడై రిసార్ట్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న అందమైన కొండల్లో ఈ రిసార్ట్స్‌ను నిర్మించడం జరిగింది. ఎంతో సౌకర్యవంతంగా, ఫైవ్‌స్టార

Webdunia
గురువారం, 17 మే 2018 (20:09 IST)
ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న కొడైక్కెనాల్‌లో తామర కొడై రిసార్ట్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న అందమైన కొండల్లో ఈ రిసార్ట్స్‌ను నిర్మించడం జరిగింది. ఎంతో సౌకర్యవంతంగా, ఫైవ్‌స్టార్ సౌకర్యాలను ఇక్కడ కల్పించడం జరిగింది. ఈ రిసార్ట్స్‌లో మొత్తం 53 సూట్స్ ఉన్నాయి. ఒక్కో సూట్‌లో బెడ్రూమ్‌తో పాటు అతిపెద్ద బాల్కనీ, లివింగ్ రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, రూమ్ టెంపరేటర్ హీటర్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ సూట్స్ అన్నీ ఫ్రెంచ్ ప్రొవిన్షియల్ డిజైన్‌తో నిర్మించడం జరిగింది.
 
ఇదే అంశంపై తమర లైస్యూర్ ఎక్స్‌పీరియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్, డైరెక్టర్ శృతి షిబులాల్ గురువారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ, ది తామర కొడైను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత రిసార్ట్స్‌ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకుని రావాలన్న ఏకైక లక్ష్యంతో దీన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. 
 
తమ ప్రయాణంలో ఇది అతిముఖ్యమైన మైలురాయి అని, ఇది రెండో లగ్జరీ రిసార్ట్స్ అని తెలిపారు. అంతేకాకుండా, దేశ హాస్పిటాలిటీ రంగంలో సరికొత్త బెంచ్ మార్క్‌ను సృష్టించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రతి సూట్ ఉడెన్ ఫ్లోర్ కలిగివుందన్నారు.


అలాగే, కలోనియల్ ఇంటీరియర్స్, రూమ్ హీటర్స్, ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్, లెడ్ టీవీ, శాటిలైట్ చానెల్స్, 24 గంటల రూమ్ సర్వీస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. చెకిన్ టైమ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై, చెక్ ‌ఔట్ టైమ్ మరుసటిరోజు ఉదయం 11 గంటల వరకు ఉంటుందన్నారు. 
 
ఈ రిసార్ట్స్‌లో లగ్జరీ సూట్‌లో ఒక రోజు ప్యాకేజీ రూ.15500 కాగా పన్నులతో కలుపుకుని ఇది రూ.19840కు చేరుతుందన్నారు. అలాగే, సుపీరియర్ సూట్ ప్యాకేజీ రూ.17000 (రూ.21760), నీలకురింజి సూట్ ప్యాకేజీ ధర రూ.30000 (రూ.38400) అని ఆమె వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments