Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశ మార్కెట్లోకి ఎల్‌జి వాష్‌టవర్

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (22:00 IST)
భారతదేశంలోని ప్రముఖ కన్స్యూమర్ డ్యూరబుల్  బ్రాండ్ అయిన ఎల్‌జి ఎలక్ట్రానిక్స్, ఈరోజు భారత మార్కెట్లో ఎల్‌జి వాష్‌టవర్‌ను అధికారికంగా విడుదల చేసినట్లు వెల్లడించింది. లాండ్రీ చేసే విధానాన్ని పునర్నిర్వచించడంలో ఎల్‌జి యొక్క నిబద్ధతకు నిదర్శనం, వాష్‌టవర్. భారతీయ గృహాల కోసం లాండ్రీ అనుభవాన్ని పునర్నిర్వచించగలమని వాగ్దానం చేస్తూ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ రెండింటినీ సజావుగా మిళితం చేసే యూనిబాడీ డిజైన్‌ను పరిచయం చేస్తోంది. కాంపాక్ట్ సైజులో (600 మిమీ x 1655 మిమీ x 660 మిమీ) (W x H x D) అందుబాటులో ఉంది, ఎల్‌జి వాష్‌టవర్ విభిన్న శ్రేణి నివాస స్థలాలకు అనుగుణంగా రూపొందించబడిన ఆదర్శవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది.
 
ఎల్‌జి వాష్‌టవర్ అసాధారణమైన లాండ్రీ అనుభవాన్ని అందించడానికి అత్యాధునిక హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌లను కలిపి లాండ్రీ ఉపకరణాలను పునర్నిర్వచించే వినూత్న యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంది. సెంటర్ కంట్రోల్ ప్యానెల్, వినియోగదారులకు సులభమైన యాక్సెస్ మరియు నియంత్రణను నిర్ధారిస్తుంది. ఈ ఆకర్షణీయమైన డిజైన్ స్పేస్ వినియోగాన్ని పెంచడమే కాకుండా మీ లాండ్రీ ప్రాంతం యొక్క సౌందర్య ఆకర్షణను కూడా పెంచుతుంది. ఎల్‌జి వాష్‌టవర్ గ్రీన్/బీజ్  కలర్ కాంబినేషన్‌లో అందుబాటులో ఉంది.
 
ఈ ఆవిష్కరణపై ఎల్‌జి ఇండియా ఎండి శ్రీ హాంగ్ జు జియోన్ మాట్లాడుతూ, "లాండ్రీ సొల్యూషన్స్ ప్రపంచంలో ఒక గొప్ప మైలురాయి ఎల్‌జి వాష్ టవర్. ఇది హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌లను సజావుగా మిళితం చేస్తుంది, ఇది లాండ్రీ అనుభవాన్ని సమర్ధవంతంగా మాత్రమే కాకుండా ఇంటిలో అధిక  స్థలం ఆక్రమించకుండా  మరియు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. దాని AI-ఆధారిత సాంకేతికతతో, ఈ వాష్ టవర్ లాండ్రీ నుండి ఊహించిన పనిని తీసుకుంటుంది, మీ బట్టలు అత్యంత జాగ్రత్తగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది" అని అన్నారు. 
 
ఈ వాష్‌టవర్ మీ లాండ్రీ పనులను క్రమబద్ధీకరించే అధునాతన ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో అమర్చబడి ఉంది. సాంకేతికత మీ బట్టలకు అత్యంత అనుకూలమైన వాషింగ్ ప్యాటర్న్‌ను గుర్తిస్తుంది, వాటిని అత్యంత జాగ్రత్త గా శుభ్రపరుస్తుంది. 'ప్రిపేర్ టు డ్రై' అవకాశం , క్విక్ వాష్ మరియు క్విక్ డ్రైతో కలిపి, కేవలం ఒక గంటలో లాండ్రీని పూర్తి చేస్తుంది, రోజువారీ రొటీన్‌కు అదనపు సౌలభ్యాన్ని జోడిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments