కరీంనగర్‌లో ఒగ్గు కథ షో ద్వారా కల్తీ చేసిన లూజ్‌ టీ పొడి పట్ల అవగాహన కార్యక్రమం

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (23:37 IST)
తెలంగాణాలో సుప్రసిద్ధ  టీ బ్రాండ్‌లలో ఒకటైన టాటా టీ జెమిని ఇప్పుడు రసాయన రంగులను తయారుచేస్తున్న టీల వల్ల కలిగే దుష్పరిణామాల పట్ల  అవగాహన కలిగించేందుకు ఓ కార్యక్రమం ప్రారంభించింది. ఇప్పటికే జనగాంలో చేసిన ఒగ్గు కథ షో అపూర్వవిజయం సాధించడంతో దానిని ఇప్పుడు కరీంనగర్‌కు తీసుకువచ్చింది. ఒగ్గు కళాకారులు భారీ సంఖ్యలో ప్రజలను ఆకర్షించడంతో పాటుగా కల్తీ టీ సేవించడం వల్ల కలిగే నష్టాలు, బ్రాండెడ్‌ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించారు.
 
వినియోగదారులకు కల్తీల పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా ఆ రకమైన పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలను గురించి వెల్లడిస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది టాటా టీ జెమిని. ఆ క్రమంలోనే తెలుగు సంస్కృతి లో అంతర్భాగమైన ఒగ్గుకథ ద్వారా ఇప్పుడు కల్తీల పట్ల ప్రచారం చేస్తోంది. ప్రాంతీయ స్ధాయిలో ఈ బ్రాండ్‌ ఇప్పుడు ఇంటింటికీ  అవగాహన కల్పించడంతో పాటుగా ‘కోల్డ్‌ వాటర్‌ టెస్ట్‌ ’ సైతం చేయడం ద్వారా టీ కల్తీని గుర్తించేలా తోడ్పడుతుంది. ఒక లక్ష ఇళ్లలో ఈ పరీక్షలను చేయాలని లక్ష్యంగా చేసుకోగా ఇప్పటికే తెలంగాణాలో 30వేలకు పైగా  ఇళ్లలో ఈ పరీక్షలు చేశారు.
 
ఈ కార్యక్రమం గురించి టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ ప్రెసిడెంట్‌-ప్యాకేజ్డ్‌ బేవరేజస్‌, ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా పునీత్‌ దాస్‌ మాట్లాడుతూ, ‘‘తెలంగాణాలో  అగ్రగామి ప్యాకేజ్డ్‌ టీ బ్రాండ్‌ టాటా టీ జెమిని. కల్తీ, లూజ్‌ టీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నాము. తెలంగాణాలో ఈ తరహా టీ ప్రభావం ప్రబలంగా ఉంది. ఈ సందేశం ప్రభావవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రాంతీయ జానపద కళారూపం ఒగ్గు కథను  ఆలంబనగా చేసుకుని  గ్రామీణుల నడుమ కల్తీ టీ సేవనం వల్ల కలిగే నష్టాలను వెల్లడిస్తున్నాము’’ అని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments