Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైక్రో సబ్‌స్టేషన్ నుండి పవర్ వోల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్ తో విద్యుత్ సరఫరా చేయడానికి ఒక ప్రదర్శన ప్రాజెక్ట్‌

ఐవీఆర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (18:25 IST)
ఉత్తర ఢిల్లీలోని 2 మిలియన్లకు పైగా వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే ప్రముఖ పవర్ యుటిలిటీ సంస్థ టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టాటా పవర్-డిడిఎల్) మరియు క్యోటో (జపాన్) కేంద్రంగా కలిగిన ప్రముఖ ఎలక్ట్రిక్ పరికరాల కంపెనీ,  నిస్సిన్ ఎలక్ట్రిక్ కో. లిమిటెడ్ లు  పవర్ గ్రిడ్ లేని ప్రాంతాలకు స్థిరంగా విద్యుత్తును అందించడానికి పవర్ వోల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్ (పివిటి)తో భారతదేశపు మొదటి మైక్రో సబ్‌స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా చేయడానికి ఒక ప్రదర్శన ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాయి.

ఈ ప్రాజెక్ట్ జపాన్ యొక్క ఎనర్జీ ఎఫిషియెన్సీ టెక్నాలజీస్‌పై అంతర్జాతీయ ప్రదర్శన ప్రాజెక్ట్‌లో భాగం, దీనిని న్యూ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (నెడో) బహిరంగంగా అభ్యర్థించింది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి, టాటా పవర్-డిడిఎల్  మరియు నిస్సిన్ ఎలక్ట్రిక్ ఆగస్టు 21, 2024న ప్రాజెక్ట్ అగ్రిమెంట్ (పిఏ )పై సంతకం చేశాయి. టాటా పవర్-డిడిఎల్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ గజానన్ ఎస్ కాలే మాట్లాడుతూ, “విద్యుత్ సరఫరా యొక్క విధానంను మార్చగల సామర్థ్యం ఉన్న ఈ ముఖ్యమైన ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి నిస్సిన్ ఎలక్ట్రిక్‌తో చేతులు కలపడానికి మేము సంతోషిస్తున్నాము. ఇది సుస్థిరమైన మరియు నమ్మదగిన విద్యుత్ సరఫరా పట్ల టాటా పవర్-డిడిఎల్  యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఉంది. భారతదేశంలోని  గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది." అని అన్నారు

ఈ ప్రదర్శన ప్రాజెక్ట్ ఆర్థిక సంవత్సరం 2025 వరకు అందుబాటులోకి రానుంది.  ఢిల్లీ శివార్లలోని సబ్‌స్టేషన్‌లో పరికరాలను ఇన్‌స్టాల్ చేసి, పరీక్షించిన తర్వాత, కంపెనీ మార్చి 2025లో కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం గురించి నిస్సిన్ ఎలక్ట్రిక్ కో. లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కెంజి కొబయాషి మాట్లాడుతూ, “మేము, నిస్సిన్ ఎలక్ట్రిక్ వద్ద, మా వ్యాపార వర్టికల్స్‌లో ఎస్ డి జి లను ప్రోత్సహించడానికి ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నాము. టాటా పవర్- డిడిఎల్ తో కలిసి భారతదేశ అభివృద్ధి చెందుతున్న ఇంధన మౌలిక సదుపాయాలలో గణనీయమైన సహకారం అందించే అవకాశాన్ని అందిస్తుంది ” అని అన్నారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments