Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ళపాటు మారటోరియం పొడగింపు???

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (18:30 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా దేశంలో వలస కూలీలు మొదలుకుని నెలసరి వేతనాలు తీసుకునే ఉద్యోగస్తుల వరకు ప్రతి ఒక్కరి జీవితాలు తలకిందులయ్యాయి. ముఖ్యంగా, ఉద్యోగస్తులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం లాక్డౌన్‌ దెబ్బకు ఉద్యోగాలు ఊడిపోయాయి. మరికొన్ని కంపెనీలు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో రుణాల చెల్లింపుపై ఆర్బీఐ తొలుత మూడు నెలల పాటు మారటోరియం విధించింది. ఆ తర్వాత దీన్ని మరో మూడు నెలల పాటు పొడగించింది. ఈ గడువు ముగిసిపోయింది. 
 
అయినప్పటికీ, మారటోరియాన్ని పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు, స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. అపుడు మారటోరియం ప్రణాళికను అందించేందుకు తమకు మరికొంత సమయం కావాలని కేంద్రం కోరింది. 
 
కేంద్రం, ఆర్బీఐ తరపున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, కొన్ని అంశాలు తన నియంత్రణలో లేవని, మారటోరియం పొడిగింపుపై ప్రభుత్వ ఆలోచనను తెలిపేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని, అవి పూర్తి కావడానికి ఇంకొంత సమయం పడుతుందని తెలిపారు. 
 
దీంతో వారం రోజుల గడువు ఇస్తూ, కేసు తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, ఇప్పటికే మారటోరియాన్ని పొడిగించేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్న సంకేతాలు వెలువడ్డాయి. రెండేళ్ల పాటు దీన్ని అమలు చేయాలని కూడా కేంద్రం భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments