Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఓవరాక్షన్.. రామచంద్ర గుహ ట్వీట్

ఇండిగో ఎయిర్‌లైన్స్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. వారంలో వరుసగా ఇండిగో సిబ్బంది ప్రయాణీకుల పట్ల చేదు అనుభవాలను రుచిచూపిస్తున్నారు. ప్రయాణీకులపై గౌరవంగా ప్రవర్తించాల్సిన సిబ్బంది ఓవరాక్షన్ చే

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (14:04 IST)
ఇండిగో ఎయిర్‌లైన్స్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. వారంలో వరుసగా ఇండిగో సిబ్బంది ప్రయాణీకుల పట్ల చేదు అనుభవాలను రుచిచూపిస్తున్నారు. ప్రయాణీకులపై గౌరవంగా ప్రవర్తించాల్సిన సిబ్బంది ఓవరాక్షన్ చేస్తున్నారు. తాజాగా చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రవర్తనపై ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు. 
 
ఇండిగో ఉద్యోగులు తనపట్ల కూడా దురుసుగా ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. ఎయిర్‌పోర్టులోనే ముగ్గురు సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారన్నారు. వారంలోనే రెండుసార్లు ఒకే ఎయిర్‌లైన్స్‌కు చెందిన సిబ్బంది తనపట్ల అమర్యాదగా ప్రవర్తించారని తెలిపారు. వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకే తాను ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించానని చెప్పారు. ఈ ఒక్కసారికి మినహాయింపు ఇచ్చానని తెలిపారు. 
 
ఇటీవల ప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుపట్ల కూడా ఇండిగో ఎయిర్‌లైన్స్ అమర్యాదగా ప్రవర్తించింది. ఆ తర్వాత రాజీవ్ కటియాల్ అనే ప్రయాణికుడిపై ఇండిగో సిబ్బంది పాశవికంగా దాడి చేసింది. అక్టోబర్ 15న ఇండిగో విమానంలో న్యూఢిల్లీకి వెళ్లిన రాజీవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎండ వేడికి తాళలేక ఓ చెట్టు వద్ద నిల్చున్న రాజీవ్‌ను.. నో ఎంట్రీ జోన్‌లో నిల్చున్నట్లు టార్మాక్ సిబ్బంది గుర్తించారు. 
 
వెంటనే ఆయనతో దురుసుగా మాట్లాడారు. ఆపై రాజీవ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సంస్థ క్షమాపణలు చెప్పింది. దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. మరి తాజా వివాదంపై ఇండిగో యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments