Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైడెన్‌ జోరు.. 50,000 మార్కును దాటి రికార్డు

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (10:59 IST)
స్టాక్ మార్కెట్‌కు గురువారం కలిసొచ్చింది. కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలు.. డిమాండ్‌ పతనం.. ఇవన్నీ బీఎస్‌ఈలో బుల్‌ దూకుడును అడ్డుకోలేకపోయాయి. ఎట్టకేలకు నేడు తొలి సారి 50,000 మార్కును దాటి రికార్డు సృష్టించింది. 
 
గురువారం ఉదయం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.29 సమయంలో సెన్సెక్స్‌ 306 పాయింట్ల లాభంతో 50,098 వద్ద నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 14,736 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రధాన రంగాల సూచీల్లోని అన్ని రంగాల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
 
గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, జేకే టయర్స్‌, సూర్య రోష్ని లిమిటెడ్‌, హవేల్స్‌ ఇండియా షేర్లు భారీ లాభాల్లో ఉండగా.. వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌,జీఎంఎం , ఆగ్రోటెక్‌ ఫూడ్స్‌, టాటా ఎలిక్సిలు భారీ నష్టాల్లో ఉన్నాయి.
 
బైడెన్‌ జోరు..
బుధవారం అమెరికాలో బైడెన్‌ సర్కారు ప్రమాణ స్వీకారం చేయడం మార్కెట్లో జోరును నింపింది. ముఖ్యంగా ట్రంప్‌ విధించిన ఆర్థిక ఆంక్షలు తొలగే అవకాశాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. మరో భారీ ఆర్థిక ప్యాకేజీ అమెరికాలో వెలువడే అవకాశం ఉడటం కూడా సూచీల్లో ఉత్తేజం నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments