Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు రోజుల్లో పెరుగుడుకు విరుగుడు : పెట్రో మంటపై అమిత్ షా కామెంట్స్

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను బూచీగా చూపి దేశంలోని చమురు కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తున్నాయి. దీంతో గతంల

Webdunia
బుధవారం, 23 మే 2018 (11:54 IST)
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను బూచీగా చూపి దేశంలోని చమురు కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా మంగళవారం ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.76.87కు చేరుకోగా, ముంబైలో రూ.84.70కి చేరింది.
 
పెట్రో ధరల పరుగుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండడంతో బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. మరో నాలుగు రోజుల్లో ఈ సమస్య నుంచి ప్రధాని మోడీ గట్టెక్కిస్తారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, త్వరలోనే ధరలను నేలకు దించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. 
 
ధరల తగ్గింపు కోసం ఉన్నతస్థాయిలో కసరత్తు జరుగుతోందని, మరో మూడునాలుగు రోజుల్లో ఆ శుభవార్త వింటారని అమిత్ షా పేర్కొన్నారు. ఓ చక్కని పరిష్కారంతో మోడీ ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. మరోవైపు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు సంస్థల అధికారులతో భేటీకి సిద్ధమయ్యారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

ఇండియన్ కల్చర్ ఎంతో గొప్పదంటున్న అమెరికన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments