Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాప్ క్లూస్ ను కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్న స్నాప్‌డీల్

Webdunia
బుధవారం, 22 మే 2019 (17:57 IST)
మరో వ్యాపార విలీనానికి అంకురార్పణ జరిగింది. ఈ-కామర్స్‌ సంస్థల్లో ఒకటైన షాప్ క్లూస్‌ను కొనుగోలు చేసేందుకు స్నాప్‌డీల్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ విలీన ఒప్పందం విషయమై ఈ రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే దాని విలువ దాదాపు 250 మిలియన్‌ డాలర్లు ఉండవచ్చు. అయితే ఈ విలీనానికి సంబంధించి రెండు సంస్థలు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
 
స్నాప్‌డీల్ గతంలో భారీ నష్టాల్లో కూరుకుపోయిన సందర్భంలో దాన్ని చేజిక్కించుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నాలకు తలొగ్గని స్నాప్‌డీల్ తన స్వంత కాళ్లపై నిలబడాలనే ఆలోచనతో సంస్థను నష్టాల నుండి గట్టెక్కించడానికి ప్రణాళికా బద్దంగా అడుగులు వేసింది. ఆ సమయంలో స్నాప్‌డీల్ తీసుకున్న నిర్ణయాలు ఆ సంస్థను నష్టాల నుండి గట్టెక్కించాయి. క్రమంగా పుంజుకున్న స్నాప్‌డీల్ ప్రస్తుతం తన కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా క్లూస్‌ నెట్‌వర్క్‌‌కు చెందిన షాప్‌ క్లూస్‌ను స్వంతం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.
 
ప్రస్తుతం షాప్‌ క్లూస్‌ను కూడా నష్టాలు చుట్టుముట్టడంతో స్నాప్‌డీల్‌ లాగానే ఆ సంస్థ కూడా నష్టాలను తగ్గించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. షాప్‌క్లూస్‌కు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.347 కోట్ల నష్టం రాగా, తర్వాత సంవత్సరంలో తన నష్టాలను రూ.208 కోట్లకు తగ్గించుకోగలిగింది.

ఇప్పటి వరకూ ప్రధాన నగరాల్లో మాత్రమే సేవలందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు టైర్‌ 2, 3 నగరాలపై కూడా దృష్టి సారిస్తోంది. స్నాప్‌డీల్‌ - షాప్‌‌క్లూస్‌ ఒప్పందం కుదిరితే భారత్‌లో ఈ-కామర్స్‌ సేవలందిస్తున్న అతిపెద్ద సంస్థల్లో ఇది కూడా ఒకటి కానుంది. వాల్‌మార్ట్‌ చేతిలో ఉన్న ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ తర్వాత మూడో అతిపెద్ద సంస్థగా స్నాప్‌డీల్‌ అవతరించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments