Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మర్ ఆఫ్ సస్టైనబిలిటీ 2024-వాటర్ వైజ్ కమ్యూనిటీస్‌ని ప్రారంభించిన స్మార్టర్ హోమ్స్

ఐవీఆర్
శుక్రవారం, 7 జూన్ 2024 (16:28 IST)
నీటి కొరత, పరిరక్షణ గురించి ప్రపంచవ్యాప్త ఆందోళనలు పెరుగుతూనే ఉన్నందున, స్మార్ట్ వాటర్ మీటరింగ్ సొల్యూషన్స్‌లో ప్రముఖ సంస్థ అయిన స్మార్టర్ హోమ్స్ నీటి సంరక్షణ ఆవశ్యకతను తెలుపుతూ తమ “సమ్మర్ ఆఫ్ సస్టైనబిలిటీ 2024 -వాటర్ వైజ్ కమ్యూనిటీస్” ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. 
 
ఈ వినూత్న ప్రచారంను బాధ్యతాయుతమైన నీటి వినియోగ సంస్కృతిని పెంపొందించడానికి, అపార్ట్‌మెంట్ కమ్యూనిటీలు తమ వినియోగాన్ని నియంత్రించడానికి, నీటి సంరక్షణ ప్రయత్నాలకు చురుకుగా సహకరించే వారిని గుర్తించడానికి రూపొందించారు. అదనంగా, ఈ ప్రచారం నీటి సంరక్షణ పట్ల సమాజ ప్రమేయం, సామూహిక బాధ్యత యొక్క భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
"వాటర్ వైజ్ కమ్యూనిటీస్" అనేది కేవలం ప్రచారం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ; నీటి ఎద్దడిపై పోరాటంలో రెసిడెన్షియల్ కమ్యూనిటీలు ఏకం కావడానికి ఇది పిలుపు. సంయుక్తంగా, పర్యావరణ అనుకూల పద్ధతులను స్వీకరించి, సానుకూల మార్పు కోసం సాంకేతికతను ఉపయోగించుకుందాం" అని శ్రీ జితేందర్ తిర్వాణి, సిఓఓ, స్మార్టర్ హోమ్స్ అన్నారు. 
 
ప్రచార ముఖ్యాంశాలు:
నీటి తగ్గింపు కోసం కమ్యూనిటీ అవార్డ్‌లు: వేసవిలో నీటి వినియోగంలో చెప్పుకోదగ్గ తగ్గింపులను చూపించే ప్రాంతాలు, సొసైటీలకు స్మార్టర్ హోమ్స్ బహుమతులు అందజేస్తుంది. 
 
ఎడ్యుకేషనల్ వెబ్‌నార్ సిరీస్: నీటి పరిరక్షణలో నీటి మీటరింగ్ యొక్క కీలక పాత్రపై స్మార్టర్ హోమ్స్ వెబ్‌నార్ల శ్రేణిని నిర్వహిస్తుంది. వినియోగాన్ని పర్యవేక్షించడం, లీక్‌లను గుర్తించడం, సమాచార నిర్ణయాల కోసం సాంకేతికతను ఉపయోగించడం గురించి నిపుణులు చర్చిస్తారు.
 
కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ఛాలెంజెస్: అవగాహనను ప్రోత్సహించడానికి కమ్యూనిటీల్లో ఇంటరాక్టివ్ సవాళ్లు, కార్యకలాపాలను స్మార్టర్‌హోమ్స్  నిర్వహిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

అజిత్ కుమార్ యాక్ష‌న్ మూవీ పట్టుదల ఫిబ్ర‌వ‌రి రిలీజ్‌

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

సంక్రాంతికి ఊహించని అద్భుతం, 200 కోట్ల క్లబ్ కు చేరబోతున్నాం : దిల్ రాజు, వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments