ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాలులు అనివార్యమైన వాస్తవంగా మారుతున్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన విధంగా, ఏప్రిల్‌లో భారత్ అంతటా అసాధారణంగా మాడిపోతున్నట్లుగా అనిపించింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడా వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గత సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాటి ప్రాతిపదికన చూస్తే దురదృష్టవశాత్తూ, 2024 మరింత వేడిగా ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ధోరణి స్థానిక సమస్య మాత్రమే కాదు; ఇది ప్రపంచవ్యాప్త ధోరణిలో భాగం. ఇది 2023ని ఇప్పటివరకు ముందెన్నడూ లేనంత అత్యంత హాటెస్ట్ ఇయర్‌గా రికార్డుకెక్కించింది. కాబట్టి, ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో, చల్లగా, సురక్షితంగా ఉండటం గతంలో కంటే చాలా కీలకం అవుతోంది.
పెరిగిన వేసవి ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు మధుమేహంతో జీవించే వ్యక్తులకు ప్రత్యేకమైన సవాళ్లతో వస్తాయి. కొన్ని సమయాల్లో మండుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వ్యక్తులు తమ శరీరం నుండి ద్రవాలు, లవణాలను కోల్పోతారు. ఇది నిర్జలీకరణం, వేడి అలసటకు దారితీస్తుంది. వేడి అలసట కారణంగా తరచుగా రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం మరింత సవాలుగా మారుతుంది. ఇది మధుమేహంతో నివసించే వ్యక్తులను అధిక ఉష్ణోగ్రతలు, తేమకు మరింత సున్నితంగా చేస్తుంది. అందువల్ల, వడగాడ్పులు రోజువారీ దినచర్యలకు అంతరాయం కలిగిస్తాయి. మొత్తం మధుమేహ నిర్వహణపై ప్రభావం చూపుతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.
ఏఐజీ హాస్పిటల్స్ (మైండ్‌స్పేస్ రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్)కు చెందిన డాక్టర్ నితిన్ రెడ్డి, MBBS, (ఎండో క్రినాలజీ), కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మధుమేహాన్ని నిర్వహించడానికి ఆరోగ్యకరమైన దినచర్యను నిర్వహించడం చాలా అవసరం. అయితే వేసవి నెలలు తరచుగా దీనికి అంతరాయాలను కలిగిస్తాయి. రోజువారీ అలవాట్లలో మార్పులు మధుమేహానికి అనుకూలమైన ఆహారాన్ని అనుసరిం చడంలో లేదా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమయానికి తనిఖీ చేయడంలో లోపాలకు దారితీయవచ్చు.
వడగాల్పుల సమయంలో, మధుమేహంతో నివసించే వ్యక్తులు నిర్జలీకరణానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ప్రత్యేకించి వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అనియంత్రితంగా ఉంటే, రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా సమతుల్యం చేయడానికి, నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ (CGM) వంటి చర్యలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. సీజీఎం పరికరాలు స్మార్ట్ ఫోన్‌లకు అనుకూలంగా ఉంటాయి, ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా నిజ-సమయ పర్యవేక్షణను అందిస్తాయి, డయాబెటిస్ నిర్వహణలో రాజీ పడడం ద్వారా వచ్చే సాధారణ మార్పులను నివారిస్తాయి అని అన్నారు.
మధుమేహం ఉన్న వ్యక్తులు రోజులో ముఖ్యమైన భాగానికి, ముఖ్యంగా వేసవిలో, సిఫార్సు చేయబడిన లక్ష్య పరిధిలో (70 - 180 mg/dl) రక్తంలో చక్కెర స్థాయిలను ఉంచడం చాలా అవసరం. దీన్ని చేయడానికి ఒక మార్గం ఏమిటంటే, నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (CGM) పరికరాలను ఉపయోగించడం. ఇది ఫింగర్ ప్రికింగ్ (వేలికి సిరంజి గుచ్చుకోవడం) అవసరం లేకుండా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలపై సమాచారాన్ని అందిస్తుంది. అటువంటి పరికరాలు టైమ్ ఇన్ రేంజ్ వంటి కొలమానాలను కలిగి ఉంటాయి. మీ రీడింగ్‌లను తనిఖీ చేయడం అనేది తరచుగా సరైన పరిధిలో ఎక్కువ సమయం గడపడంతో ముడిపడి ఉంటుంది. తద్వారా ఇది మీ గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరుస్తుంది.
మీరు వడగాలులను అధిగమించి, మీ మధుమేహాన్ని అదుపులో ఉంచుకునే 4 సాధారణ చర్యలు:
1. హైడ్రేషన్ అనేది గోల్డెన్ రూల్: వడగాలుల సమయంలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి, మీకు దాహం అనిపించకపోయినా, పుష్కలంగా నీరు తాగడం ద్వారా మీరు హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోండి. సరైన హైడ్రేషన్ (ఆర్ద్రీకరణ) రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా రక్తప్రవాహం నుండి విషపదార్థాలను కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా వేడి వాతావరణంలో నీటి నష్టం పెరగడం వల్ల మధుమేహంతో జీవించే వ్యక్తులు డీహైడ్రేషన్‌కు గురవుతారు. తగినంత ద్రవం తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, ఎందుకంటే అధిక బ్లడ్ షుగర్ మూత్రవిసర్జనను పెంచుతుంది, ఇది నిర్జలీకరణానికి మరింత దోహదం చేస్తుంది. ఒక వ్యక్తి తాగవలసిన నీటి పరిమాణం అనేది ఆ వ్యక్తి బరువు, వయస్సు, శారీరక శ్రమ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉన్నప్పటికీ, సగటున, ఒక వ్యక్తి రోజుకు కనీసం 2 లీటర్ల నీటిని తీసుకోవాలి.
2. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం: వడగాలుల సమయంలో మీ రక్తంలో చక్కెర స్థాయిలను నిలకడగా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఫ్రీస్టైల్ లిబ్రే వంటి అధునాతన సెన్సర్-ఆధారిత నిరంతర పర్యవేక్షణ పరికరాలు మీరు పని చేస్తున్నా లేదా నిద్రపోతున్నా, మీ గ్లూకో జ్ ధోరణులను 24 గంటల పాటు కొనసాగించడాన్ని సులభతరం చేస్తాయి. అవి మీ గ్లూకోజ్ స్థాయిలను నిశితంగా గమనిస్తాయి. మీ హెచ్చుతగ్గులపై శ్రద్ధ అవసరమైతే కచ్చితమైన, నిజ-సమయ హెచ్చరికలను అందిస్తాయి. కాబట్టి మీరు అకస్మాత్తుగా బ్లడ్ షుగర్ క్రాష్ లేదా స్పైక్ గురించి ఆందో ళన చెందాల్సిన అవసరం లేకుండా గడపవచ్చు. మీరు మీ రీడింగ్‌లను గమనిస్తూ ఉండాలి. రోజుకు ఉండే 24 గంటలలో 17 గంటల పాటు సరైన గ్లూకోజ్ శ్రేణిలో ఉండటానికి ప్రయత్నించాలి.
3. మీ వ్యాయామాన్ని తెలివిగా ప్లాన్ చేసుకోండి: మధుమేహ సంరక్షణలో ముఖ్యమైన దశ చురుకైన జీవనశైలి; అయినప్పటికీ, సన్ బర్న్, డీహైడ్రేషన్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కూడా అవసరం. చాలా వేడిగా ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా ఉండండి. బదులుగా ఇంట్లో చేసే వ్యాయా మాలు లేదా యోగాను ఎంచుకోండి. మీరు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో బయట వ్యాయామం చేయవచ్చు. వేడి ఉష్ణోగ్రతల సమయంలో ఇండోర్ జిమ్ లేదా ప్రాక్టీస్ స్ట్రెచ్‌లకు పరిమితం కావడం మంచిది.
4. ఆరోగ్యకరమైనవి తినండి: వేసవిలో ఐస్‌క్రీం, శీతల పానీయాలను కోరుకోవడం ఎంతో సహజం. అయినప్పటికీ, మధుమేహం ఉన్న వ్యక్తులు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి పరిస్థితికి తగిన సమతుల్య, ఆరోగ్యకర ఆహారాన్ని తీసుకునేలా చూసుకోవాలి. అధిక ఫైబర్ కలిగిన కూరగాయలు, ఆకుకూరలు, బ్రస్సెల్ మొలకలు వంటి వాటిని ఆహారంలో పుష్కలంగా చేర్చుకోవడం గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న నారింజ, నిమ్మ, ఉసిరి వంటి సిట్రస్ పండ్లను కూడా రోజువారీ భోజనంలో చేర్చుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
వేసవికాలం అనేది విశ్రాంతి, ఆహ్లాదం ఎక్కువగా కోరుకునే సమయం. మధుమేహం ఉన్నవారికి ఈ సీజన్‌ను పూర్తిగా ఆస్వాదించడం సవాలుగా ఉంటుంది. ఈ జీవనశైలి వ్యాధిని నిర్వహించడానికి చిన్నచిన్న నిర్వహించదగిన చర్యలు తీసుకోవడం ద్వారా, మీరు మీ ఆరోగ్యాన్ని నియంత్రించుకోవచ్చు, పూర్తిగా ఈ సీజన్‌ను ఆస్వాదించవచ్చు.