భారతదేశంలో నీటి నిర్వహణ పరిష్కారాలకు సంబంధించి అత్యంత విశ్వసనీయ సంస్థ అయిన సింటెక్స్, తమ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. బాధ్యతాయుతమైన రీతిలో నీటి వినియోగాన్ని చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసేందుకు 24 గంటల్లో 31,000 మందికి పైగా ప్రజలను సమీకరించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సంపాదించింది. భారతదేశంలోని అత్యంత కీలకమైన సవాళ్లలో ఒకటైన స్వచ్ఛమైన, సురక్షితమైన నీటిని పొందడం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం గురించి అవగాహన పెంచడం ఈ దేశవ్యాప్త కార్యక్రమ లక్ష్యం. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలు, భాగస్వాములు, ఉద్యోగులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కలిసి ప్రతిజ్ఞ చేశారు. నీరు, ఆరోగ్యాన్ని కాపాడటానికి సమిష్టి నిబద్ధతను పునరుద్ఘాటించారు.
వెల్స్పన్ బిఏపిఎల్ లిమిటెడ్, ఎండి-సింటెక్స్ డైరెక్టర్ యశోవర్ధన్ అగర్వాల్ మాట్లాడుతూ, నీటి నిల్వ ట్యాంకులలో 50 సంవత్సరాల వారసత్వం, నాయకత్వం కలిగిన సింటెక్స్‌కు ఇది ఒక ప్రతిష్టాత్మక క్షణం. నీటి కాలుష్యం, తగిన రీతిలో నీటిని నిల్వ చేయకపోవటం వంటివి భారతదేశంలో తీవ్రమైన ప్రజారోగ్య ప్రమాదాలను కలిగిస్తూనే ఉన్నాయి. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తికి గణనీయంగా దోహదం చేస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా, నీటి నిల్వ యూనిట్లను క్రమంతప్పకుండా శుభ్రపరచడం ద్వారా తాగునీరు, వాడుకోవడానికి వినియోగించే నీటిని పరిశుభ్రంగా నిల్వ చేయడం, తద్వారా కాలుష్యాన్ని నివారించడం, తమ కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడటం అనే సరళమైనప్పటికీ శక్తివంతమైన నిబద్ధతను కలిగి ఉండటానికి మేము వ్యక్తులను ప్రేరేపిస్తున్నాము. సేకరించిన ప్రతి ప్రతిజ్ఞ, చేరుకునే ప్రతి వ్యక్తి మరింత బాధ్యతాయుతమైన, శుభ్రమైన నీటి స్పృహ కలిగిన భారతదేశం దిశగా వేసే ఒక అడుగు. ఈ రికార్డు సృష్టించిన విజయం ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలుకుతుంది అని అన్నారు.
సురక్షితం కాని నీటి కారణంగా గణనీయమైన ఆరోగ్య భారాన్ని భారతదేశం మోస్తోంది. ఇప్పటికీ, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో దాదాపు 13% మరణాలకు కారణమైన అతిసారం(డయేరియా) మూడవ అత్యంత సాధారణ కారణంగా నిలుస్తోంది. సింటెక్స్ యొక్క కార్యక్రమం, కార్పొరేట్ ప్రయోజనం, ఆవిష్కరణ, ప్రజల శక్తి, నిజమైన మార్పును ఎలా తీసుకురావచ్చో వెలుగులోకి తెస్తుంది. ప్రత్యేక మైక్రోసైట్‌లో నిర్వహించిన ప్రతిజ్ఞ, ఆసక్తి కలిగిన వారిని లాగిన్ చేసి ధృవీకరించమని ఆహ్వానించింది:
నీరు కలుషితం కాకుండా నిరోధించడానికి, నా కుటుంబ భద్రతను నిర్ధారించడానికి నీటి నిల్వ యూనిట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ద్వారా నేను వాడకానికి మాత్రమే వినియోగించే & త్రాగడానికి వినియోగించే నీటిని పరిశుభ్రమైన స్థితిలో నిల్వ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఐదు దశాబ్దాలకు పైగా, భారతదేశ నీటి నిర్వహణ పరిశ్రమలో ఆవిష్కరణ, విశ్వసనీయత, నాణ్యతకు పర్యాయపదంగా సింటెక్స్ నిలిచింది. నిల్వకు మించి, ఈ కంపెనీ నేడు ట్రాన్స్‌మిషన్(పైపులు), నిల్వ(ట్యాంకులు), శుద్ధి(పారిశుధ్యం)లను కవర్ చేసే సమగ్ర నీటి నిర్వహణ పరిష్కారాలను అందిస్తుంది.
సింటెక్స్‌లోని అన్ని ఉత్పత్తులు 100% ఫుడ్-గ్రేడ్ వర్జిన్ ప్లాస్టిక్‌తో తయారుచేయబడ్డాయి. ఇవి శుభ్రమైన, సురక్షితమైన నీటిని నిర్ధారిస్తాయి, బీపీఏ, థాలేట్లు, ఫార్మాల్డిహైడ్ వంటి రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌లలో కనిపించే టాక్సిన్‌ల నుండి కుటుంబాలను రక్షిస్తాయి.