Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌండ్ ఫిగర్‌కు పెట్రోల్ కొట్టిస్తున్నారా.. అయితే, మోసపోయినట్టే.. ఎలా?

పెట్రోల్‌ బంకుల్లో పని చేసే సిబ్బంది వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పెట్రోల్‌ బంకు నిర్వాహకులపై అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వారి దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వాహనదార

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (15:40 IST)
పెట్రోల్‌ బంకుల్లో పని చేసే సిబ్బంది వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పెట్రోల్‌ బంకు నిర్వాహకులపై అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వారి దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వాహనదారులు 100 రూపాయలకు పెట్రోల్‌ పట్టించుకునేందుకు వెళితే మీటర్‌లో మాత్రం వంద రూపాయలు చూపిస్తుంది. వాహనదారునికి మాత్రం 75 రూపాయల నుండి 80 రూపాయల విలువ చేసే పెట్రోల్‌ మాత్రమే ట్యాంకులో పడుతుంది. వాహన వినియోగదారులను దోచుకునేందుకు రోజు రోజుకు కొత్త కొత్త పద్ధతిని అమలుచేస్తూ ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. 
 
అదేమిటో తెలుసుకుని ముందు జాగ్రత్త వహించకుంటే పెట్రోల్, డీజిల్ కొనడానికి వెళ్లిన ప్రతిసారీ మోసపోవాల్సిందే. సాధారణంగా మనం రూ.50, రూ.100, రూ.200, రూ.300, రూ.500 రూపాయల రౌండ్ ఫిగర్‌కు పెట్రోల్ పోయిస్తుంటాం. అయితే ఈ లెక్కన లీటరుకు 200 మిల్లిలీటర్లు పెట్రోల్ని నష్టపోతున్నామని సోషల్ మీడియాలో ఓ హిందీ వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలో కనీసం 200 మిలీ పెట్రోల్‌ను నష్టపోయినట్టే. 
 
దీనిపై బంక్ నిర్వాహకులు పెట్రోల్ పంప్ డిజిటల్ మీటర్ ప్రోగ్రామింగ్‌లో ముందే ఓ 50 నుంచి 300 ఎంఎల్ తక్కువగా వచ్చేలా సెట్ చేస్తారట. అయితే మొత్తం పెట్రలో పంప్ సెట్టింగ్ మాత్రం సాధారణంగానే ఉంటుంది. కాబట్టి పెట్రోల్, డీజిల్ వినియోగదారులు ఈ రౌండ్ ఫిగర్‌తో కాకుండా 110, 155, 210, 510 రూపాయిల్లో పెట్రోల్ పోయించుకోవాలని అధికారులు సలహా ఇస్తున్నారు. రౌండ్ ఫిగర్ ధరల్లో తక్కువ ఇంధనం నమోదు చేస్తూ విక్రయాలు చేస్తున్నారని తెలిపారు. ఈ మోసం వల్ల వినియోగదారులకు తెలియకుండానే మోసపోతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments