Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు... నేటి నుంచి రిజర్వేషన్

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (15:24 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన రైళ్లను భారతీయ రైల్వే శాఖ దశలవారీగా పట్టాలెక్కిస్తోంది. ఇప్పటికే శ్రామిక్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు, ఫెస్టివల్ స్పెషల్ రైళ్ళ పేరుతో రైళ్ల సంఖ్యను క్రమంగా పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీ నుంచి దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లను పట్టాలపై పరుగు పెట్టించాలని నిర్ణయించింది. ఈ రైళ్లు దేశంలోని మెట్రో నగరాలతో పాటు.. ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు కూడా నడుపనున్నారు. ఈ రైళ్ళలో ప్రయాణం చేయదలచిన వారు బుధవారం నుంచే రిజర్వేషన్ చేసుకోవచ్చు. 
 
ఇందులోభాగంగా, న్యూఢిల్లీ నుంచి హబీబ్‌గంజ్ మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను నడపడానికి రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైలు నేటి నుంచి రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ రైలు ఏడున్నర నెలల తర్వాత ట్రాక్‌లో పడటం విశేషం. ఈ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయంతో ఢిల్లీ, భోపాల్ వెళ్లే ప్రజలకు నగరానికి ఎంతో ఉపశమనం లభించనున్నది.
 
కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా 2020 మార్చి 25 వ తేదీ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు అన్ని రైళ్లను నిలిపివేశారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత రైల్వే ట్రాఫిక్‌ను మెల్లమెల్లగా పునరుద్ధరిస్తున్నారు. తొలుత సుదూర ప్రాంతాలకు రైళ్లు నడిపారు. నవరాత్రి పండుగ సమీపించడంతో ఈ రైళ్లలో వెయింటింగ్ లిస్టు చాంతాడంత తయారైంది. దీంతో పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే బోర్డు 196 రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments