Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనంతపురం నుంచి డిల్లీకి కిసాన్ రైలు ప్రారంభం

Advertiesment
అనంతపురం నుంచి డిల్లీకి కిసాన్ రైలు ప్రారంభం
, బుధవారం, 9 సెప్టెంబరు 2020 (14:25 IST)
అనంతపురం నుంచి డిల్లీకి కిసాన్ రైలు ప్రారంభమయ్యింది. అనంతపురం నుంచి డిల్లీలోని ఆదర్శ్ నగర్ వరకు ఈ రైలు నడుస్తుంది. ఈ కిసాన్ రైలును బుధవారం ఉదయం ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ సి.అంగడి జూమ్ ద్వారా జెండా ఊపి రైలును ప్రారంభించారు.
 
అనంతపురం రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు బయలుదేరింది. అనంతపురం నుంచి బయలుదేరిన ఈ రైలు డిల్లీ లోని ఆదర్శ్ నగర్‌కు చేరుకుంటుంది. అందులో లోడ్ చేసిన పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలిస్తారు. 321 టన్నుల పంట ఉత్పత్తులను అనంతపురం స్టేషన్లో లోడ్ చేస్తారు.
 
ఈ సందర్భంగా నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులను శరవేగంగా మార్కెట్టులో చేరవేయడానికి తాము కిసాన్ రైలును ప్రారంభించామని అన్నారు. అనంతపురం జిల్లాలో రెండు లక్షలకు పైగా హెక్టార్లలో రైతులు కూరగాయలను పండిస్తున్నారని, అలాంటి ప్రాంతం నుంచి కిసాన్ రైలును ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్‌ తరగతులు అర్థం కాలేదు... ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని