ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కరోనా పంజా విసిరింది. ఈ కొత్త రకం కరోనా ప్రభావం భారత మార్కెట్లపై కూడా తీవ్రంగా చూపింది. ఫలితంగా మంచి జోరుమీదున్న సెన్సెక్స్ సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ కారణంగా క్షణాల్లో 6.6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం గజగజ వణికిపోతోంది. తాజాగా మరో కొత్త రకం వైరస్ బ్రిటన్‌లో పురుడుపోసుకున్నాయి. దీంతో భారత్ స్టాక్ మార్కెట్లు సహా ప్రపంచ మార్కెట్లను పతనానికి కారణమైంది. ట్రేడర్లు అమ్మకాలు పోటెత్తించడంతో బీఎస్‌ఈ సూచీ ఏకంగా 1406.73 పాయింట్లు నష్టపోయింది.
2020 మే తర్వాత సూచీకి ఇదే అతి పెద్ద పతనంగా మార్కెట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా దెబ్బకు రూ. 6.6 (ట్రిలియన్లు) లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరైపోయింది. ముందుగా జాగ్రత్తగా ట్రేడర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు ముందుకు వచ్చారు.
అమ్మకాలకు ఆసక్తి చూపించారు. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 1,406.73 పాయింట్లు (3 శాతం) నష్టపోయి 45,553.96 వద్ద ముగిసింది. మే 4 తర్వాత అతిపెద్ద ఒక్కరోజు పతనం ఇదే. 2 వేల పాయింట్లకు పైగా కోల్పోయి 45 వేల దిగువకు జారుకుంది. కాసేపటికి మళ్లీ పుంజుకుంది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రామాణిక సూచీ నిఫ్టీ సైతం 432.15 పాయింట్లు 3.14 శాతం క్షీణించి 13,328.40 వద్ద పతనమైంది. దలాల్ స్ట్రీట్ దమనకాండలో రూ.6.6 లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరైపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీలన్నింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.178,79,323 కోట్లకు పతనమైంది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ కంపెనీల షేర్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి.