Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీఐ ఏడు రకాల డెబిట్ కార్డులు.. ఏ కార్డుపై ఎంత డ్రా చేయొచ్చంటే...

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (13:50 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌గా ఉన్న భారత స్టేట్ బ్యాంకు తమ ఖాతాదారులకు ఓ శుభవార్త చెప్పింది. ఆ బ్యాంకు వినియోగదారులకు ఏడు రకాల డెబిట్ కార్డులను జారీ చేస్తోంది. ఈ కార్డులపై విత్‌డ్రాయల్స్ పరిమితి ఆంక్షలు అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏటీఎంల నుంచి రోజువారీ విత్ డ్రా చేసుకునే నగదు పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించింది. 
 
ఏడు రకాల డెబిట్ కార్డులపై విత్ డ్రాయల్ లిమిట్‌ను పెంచుతున్నామని తెలిపింది. కార్డులను బట్టి రోజుకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా ఎనిమిది ట్రాన్జాక్షన్ వరకు ఉచితంగా చేసుకోవచ్చని... అంతకు మించితే ఛార్జీలు విధిస్తామని తెలిపింది.
 
అంతేకాకుండా, అంతేకాకుండా, రూ.10 వేలు అంతకు మించి విత్ డ్రా చేసుకునేటప్పుడు వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుందని... ఆ ఓటీపీని ఏటీఎంలో ఎంటర్ చేయాలని ఎస్బీఐ తెలిపింది. ఓటీపీ ఎంటర్ చేయకపోతే... ఆ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్‌గా రద్దు అయిపోతుందని తెలిపింది.
 
ఇకపోతే, డెబిట్ కార్టుల వారీగా రోజువారీ విత్ డ్రాయల్ లిమిట్ వివరాలు:
* క్లాసిక్ మరియు మాస్ట్రో డెబిట్ కార్డు కలిగివున్న వినియోగదారుడు రోజుకు రూ.20 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. 
* గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉన్నవారు రూ.40 వేలు. 
* గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు కలిగిన ఖాతాదారులు రూ.50 వేలు.
* ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉన్న వారు రూ.1 లక్ష.
* ఇన్ టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు ఉన్నవారు రూ.40 వేలు
* ముంబై మెట్రో కాంబో కార్డు ఉన్నవారు రూ.40 వేలు
* మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు కలిగిన వినియోగదారులు రూ.40 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments