Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ను పారదోలటం ఇప్పట్లో జరిగే పనికాదు.. ఆర్బీఐ మాజీ గవర్నర్

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (15:18 IST)
కరోనా వైరస్‌పై ప్రపంచ దేశాలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనూ లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఎక్కడి రవాణా వ్యవస్థ అక్కడే నిలిచిపోయింది. సంస్థలన్నీ మూతపడ్డాయి. ఉద్యోగులు వ్యాపారులు అనే తేడా లేకుండా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో అన్నీ రంగాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. 
 
ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో లాక్ డౌన్ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అన్ని రంగాలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. తాజాగా దేశంలో నెలకొన్న సంక్షోభంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పేదలను ఆదుకోవాలంటే కేంద్రానికి ఏకంగా రూ.65వేల కోట్ల నిధులు కావాలన్నారు. 
 
కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేశం నుండి పూర్తిగా కరోనా వైరస్ పారదోలడం గాని లేదా కరోనా వైరస్ కేసుల సంఖ్య జీరో చేయడం కానీ ఇప్పట్లో జరిగే పని కాదంటూ వ్యాఖ్యానించారు. అయితే సామాజిక దూరాన్ని దేశ ప్రజలందరికీ అలవాటు చేస్తే భవిష్యత్తులో కూడా ఎంతో మంచిది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
ఓవైపు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతూనే.. మరోవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూడా చర్యలు చేపట్టడమే ప్రస్తుతం కేంద్రం చేయాల్సిన పని అని రఘురాం రాజన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments