Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురక్షితమైన రేపటి కోసం నేటి నుంచే సన్నద్ధత:హెచ్‌డిఎఫ్‌సి ప్రొటెక్షన్ క్యాంపెయిన్ పైన రిషభ్ పంత్ స్టోరీ

ఐవీఆర్
సోమవారం, 9 సెప్టెంబరు 2024 (21:05 IST)
భారతదేశంలోని ప్రముఖ బీమా సంస్థల్లో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, క్రికెటర్ రిషబ్ పంత్‌తో తన తాజా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం జీవితంలోని సవాళ్లు,  అనిశ్చి తులను అధిగమించడంలో సన్నద్ధత ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. వ్యక్తులు, వారి కుటుంబాల కోసం టర్మ్ ప్లాన్‌లను కీలకమైన భద్రతా వలయంగా ఉంచుతుంది. ఈ ప్రచార చిత్రం రిషబ్ పంత్ బౌన్స్‌బ్యాక్ ప్రయాణానికి అద్దం పట్టే ఒక ఉత్తేజకరమైన కథనాన్ని అందిస్తుంది. రిషబ్ జీవితం అనూహ్యతను ప్రతిబింబిస్తుంది.   చిన్ననాడు అతని తల్లి  అన్న మాటలు అతనిని ఎదురుదెబ్బ నుండి ముందుకు నడిపించిన కీలక ఘట్టాన్ని గుర్తుచేసుకోవడాన్ని ఇది చూపిస్తుంది. సంక్షోభ సమయాల్లో జీవిత బీమా ఆర్థిక భద్రతను ఎలా అందజేస్తుందో తెలియజేస్తుంది. దూరదృష్టి, ప్రణాళిక ద్వారా ప్రతి సవాలును కూడా అధిగమించవచ్చని చాటిచెబుతూ బాగా సిద్ధమైన రిషబ్ ప్రపంచాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే ప్రస్తు తానికి కథ పరివర్తన చెందుతుంది.

హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌తో రిషబ్ పంత్ అనుబంధం గత ఏడాది కాలంగా మరింత బలపడింది. మైదానం లోపల, వెలుపల రెండు చోట్లా అతని ప్రయాణం బ్రాండ్ ప్రధాన విలువ అయిన ‘సర్ ఉఠా కే జీయో’ — జీవితాన్ని గర్వంగా, ఆత్మవిశ్వాసంతో గడపడంతో లోతుగా మమేకమవుతుంది.

రిషబ్ పంత్ తన కొనసాగుతున్న భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, ‘‘హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌తో ఇది అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రచారం నా హృదయానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే ఇది సవాళ్ల నుండి తిరిగి పుంజుకోవడం   సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ వ్యక్తులు తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడంలో చురుకుగా ఉండాల్సిందిగా నిరంతరం ప్రోత్సహిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగమైనందుకు నేను గర్విస్తున్నాను’’ అని అన్నారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments