రెనాలిక్స్ స్వదేశీ ఏఐ ఆధారిత స్మార్ట్ హెమోడయాలసిస్ మెషీన్‌ విడుదల

ఐవీఆర్
బుధవారం, 11 జూన్ 2025 (19:43 IST)
మూత్రపిండ సంరక్షణలో అగ్రగామి సాంకేతిక ఆవిష్కరణ సంస్థ అయిన రెనాలిక్స్ హెల్త్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రియల్-టైమ్ రిమోట్ మానిటరింగ్,  క్లినికల్ కనెక్టివిటీ సౌకర్యంతో ప్రపంచంలోనే మొట్టమొదటి, పూర్తిగా స్వదేశీ, ఏఐ- క్లౌడ్-ఆధారిత స్మార్ట్ హెమోడయాలసిస్ మెషీన్ రెనాలిక్స్-RxT 21ని విడుదల చేసింది. రూ. 6.70 లక్షల నుండి ప్రారంభమయ్యే దీని ధర, దిగుమతి చేసుకున్న యంత్రాల కంటే చాలా తక్కువ. సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో మూత్రపిండ సంరక్షణలో డిమాండ్-సరఫరా అంతరాన్ని రెనాలిక్స్- RxT 21 తగ్గించనుంది. 
 
భారతదేశంలో పూర్తిగా రూపొందించి, తయారు చేయబడిన రెనాలిక్స్- RxT 21, క్లౌడ్-ఆధారిత టెలినెఫ్రాలజీ ప్లాట్‌ఫామ్‌లతో సహా తాజా సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుని, కిడ్నీ రోగులు, ఎండ్-స్టేజ్ మూత్రపిండ వ్యాధి(ESRD) రోగులకు, ముఖ్యంగా కార్డియోవాస్కులర్, పల్మనరీ, తీవ్రమైన మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి నాణ్యమైన సంరక్షణను అందిస్తుంది.
 
Rx T21 విడుదల గురించి రెనాలిక్స్ హెల్త్ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు- డైరెక్టర్ డాక్టర్ శ్యామ్ వాసుదేవరావు మాట్లాడుతూ, “మా అత్యాధునిక హెమోడయాలసిస్ యంత్రం డయాలసిస్ సౌకర్యాన్ని సరసమైనదిగా చేయటంతో పాటుగా మూత్రపిండ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. డయాలసిస్ సేవలను రోగుల ఇళ్లకు దగ్గరగా తీసుకురావడం ద్వారా, పెరుగుతున్న దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి(CKD) భారాన్ని, ESRD రోగుల సమస్యలను పరిష్కరించడంలో RxT 21 సహాయపడుతుంది. దిగుమతి చేసుకున్న యంత్రాలతో పోలిస్తే RxT 21 యొక్క మొత్తం యాజమాన్య వ్యయాన్ని 40% తగ్గించడానికి మేము ప్రణాళికలు చేస్తున్నాము. ‘మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్’ అనే ప్రభుత్వ లక్ష్యంకు అనుగుణంగా, మేము మా RxT 21ను వివిధ దేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments