Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ ఏజీఎం భేటీ : సరికొత్త స్మార్ట్ ఫోన్... జియో ఇనిస్టిట్యూట్

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (16:08 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 44వ వార్షిక సర్వసభ్య సమావేశం గురువారం మధ్యాహ్నం ముంబైలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో రిలయన్స్ జియో కొత్తగా ఓ స్మార్ట్ ఫోనును తీసుకుని రానుంది. అలాగే, నవీ ముంబైలో జియో ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పనుంది. కాగా, ఈ ఏజీఎం భేటీలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ హోదాలో నీతా అంబానీ కూడా పాల్గొన్నారు. 
 
ఇందులో ఆమె మాట్లాడుతూ, ముంబైలో జియో ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పనున్నట్టు తెలిపారు. నవీ ముంబైలో దీన్ని నెలకొల్పుతామన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ, ఈ విద్యాసంవత్సరం నుంచే జియో ఇనిస్టిట్యూట్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయన్నారు. 
 
జీవితకాల శిక్షణ, అత్యున్నత ఆవిష్కరణలకు జియో ఇనిస్టిట్యూట్ ఓ ప్రపంచస్థాయి వేదికగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు ఉపకారవేతనాలు కూడా అందజేస్తామన్నారు. 
 
దేశవ్యాప్తంగా 21 వేల మంది పిల్లలకు క్రీడల్లో శిక్షణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మహిళలు, బాలికల సాధికారతకు కృషి చేస్తామని వివరించారు. ముఖ్యంగా, గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.
 
అంతేకాదు, కొవిడ్‌తో పోరాటానికి తమ రిలయన్స్ ఫౌండేషన్ 5 కార్యాచరణలు ప్రారంభించిందని నీతా అంబానీ వెల్లడించారు. మిషన్ ఆక్సిజన్, మిషన్ కొవిడ్ ఇన్ ఫ్రా, మిషన్ అన్న సేవ, మిషన్ ఎంప్లాయీ కేర్, మిషన్ వ్యాక్సిన్ సురక్ష పేరిట ఈ ఐదు మిషన్లు కొనసాగుతాయని వివరించారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments