Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీరల వ్యాపారంలోకి ముఖేశ్ అంబానీ.. 'అవంత్రా' బ్రాండ్‌తో..?

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (15:57 IST)
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రతి రంగంలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చీరల వ్యాపారంలోకి కూడా ఆయన అడుగుపెట్టబోతున్నారని. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగమైన రిలయన్స్ రీటైల్ ఈ వ్యాపారాన్ని చేపట్టబోతోంది. చీరలతో పాటు భారతీయ సాంప్రదాయ దుస్తుల అమ్మకాల కోసం 'అవంత్రా' బ్రాండ్ నేమ్ తో స్టోర్లను ఏర్పాటు చేయనుంది. 
 
ఈ పండుగ సీజన్ లోనే బెంగళూరులో తొలి స్టోర్ ను ఏర్పాటు చేయబోతోంది. ఆ తర్వాత కర్ణాటకలోని ఇతర ప్రాంతాలతో పాటు ఏపీలో స్టోర్లను ఏర్పాటు చేయబోతోందని ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.
 
ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్, టాటా గ్రూప్ కు చెందిన తనిష్క్ కు పోటీగా ఈ వ్యాపారాన్ని అంబానీ చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. తనిష్క్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ సంస్థలు కూడా త్వరలోనే సాంప్రదాయ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయి. 
 
అవంత్రా తన సొంత బ్రాండ్ దుస్తులతో పాటు నల్లీ సిల్క్స్, పోతీస్ వంటి ప్రైవైట్ బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోనుంది. అంతేకాదు ఆయా ప్రాంతాల్లోని నేత కార్మికులతో ఒప్పందం చేసుకోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments