Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాబోయే ఆరు నెలల్లో రెసిడెన్షియల్‌ రియాల్టీ కన్స్యూమర్‌ దృక్పథం ఆశాజనకంగా ఉంది

Webdunia
శనివారం, 31 జులై 2021 (22:14 IST)
కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యతా పెట్టుబడి మార్గంగా రియల్‌ ఎస్టేట్‌ కొనసాగుతుంది. కానీ అధికశాతం మంది గృహ కొనుగోలుదారులు రాయితీలతో పాటుగా సౌకర్యవంతమైన చెల్లింపు అవకాశాలను ప్రోత్సాహాకాలుగా కోరుకుంటున్నారు అని హౌసింగ్‌ డాట్‌ కామ్‌ మరియు నరెడ్కో అధ్యయనం వెల్లడించింది. దాదాపు మూడు వేల మంది వినియోగదారులపై ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్‌ నెలల మధ్యకాలంలో అధ్యయనాన్ని రియల్‌ ఎస్టేట్‌ పోర్టల్‌ నిర్వహించింది.
 
ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం, రియల్‌ ఎస్టేట్‌ అనేది అత్యంత ప్రాధాన్యతా పెట్టుబడి మార్గంగా 43% మంది స్పందనదారులకు నిలిచింది (గత సంవత్సరం 35%). దీనిని అనుసరించి స్టాక్స్‌ 20%(15 % గత సంవత్సరం), ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 19%(22 % గత సంవత్సరం), బంగారం 18% (గత సంవత్సరం 28%) ఉన్నాయి.
 
‘‘ఆరోగ్య పరంగా సంక్షోభం నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా గృహ యాజమాన్యం అనేది అత్యంత ప్రాధాన్యతాంశం అయింది. ఈ ఫలితంగానే, రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో తొలిసారి గృహ కొనుగోలుదారుల నుంచి మాత్రమే కాదు, తమ ఇళ్లను మరింతగా ఆధునీకరించుకోవాలనుకునే వారి నుంచి కూడా డిమాండ్‌ పెరిగింది’’ అని శ్రీ ధృవ్‌ అగర్వాల, గ్రూప్‌ సీఈఓ, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ మరియు ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.
 
‘‘కోవిడ్‌ మహమ్మారి అనంతర కాలంలో ఈ డిమాండ్‌ మరింతగా వృద్ధి చెందింది. అతి తక్కువగా ఉన్న ధరలు, గృహ ఋణాలపై చారిత్రాత్మకంగా అతి తక్కువ వడ్డీరేట్లు వంటివి రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు విజయవంతంగా అత్యంత కఠినమైన ఆర్ధిక పరిస్థితుల నుంచి బయటపడటానికి దోహదం చేశాయి’’ అని శ్రీ అగర్వాల జోడించారు.
 
ఈ అధ్యయన ఫలితాలను గురించి నరెడ్కో అధ్యక్షులు మరియు ఫౌండర్‌ మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ – హిరాందానీ గ్రూప్‌ , డాక్టర్‌ నిరంజన్‌ హిరాందానీ మాట్లాడుతూ గృహాలకు డిమాండ్‌ అంతర్లీనంగా ఉందనే విషయాన్ని నొక్కి చెప్పారు. ఆయనే మాట్లాడుతూ ‘‘మారిన ప్రాధాన్యతలతో కోవిడ్‌ 19 మహమ్మారి సంక్షోభం సొంత ఇంటి విలువను పునరుద్ఘాటించింది. ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ జీవనంకు ఆదరణ పెరుగుతుంది. సమగ్రమైన జీవనశైలి అవకాశాలను అందించడంతో పాటుగా ఇంటి వద్దనే పనిచేసే అవకాశాలనూ అందిస్తున్నాయి.
 
పండుగ సీజన్‌ సమీపిస్తుండటంతో  నెమ్మదిగా ఆర్ధిక వ్యవస్థ కోలుకుంటుండటంతో పాటుగా క్యాపిటల్‌మార్కెట్లు సాధారణంగా ఉండటం, గృహ ఋణ వడ్డీరేట్లు తక్కువగా ఉండటం, రికార్డు స్థాయి విదేశీ నిల్వలు, ఎఫ్‌డీఐలు పెరగడం, ఉపాధి అవకాశాలు పెరగడం, ఆశావాద డిమాండ్‌ ప్రేరణ , జీఎస్‌టీ రేట్లు తగ్గింపు, పన్ను ప్రయోజనాలు వంటివి స్థిరంగా డిమాండ్‌ వృద్ధి చెందడంలో తోడ్పడతాయి మరియు 2021-22 ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో సానుకూల వినియోగదారుల విశ్వాసం పొందడంలోనూ సహాయపడుతుంది’’ అని అన్నారు.
 
ఈ అధ్యయనంలో కనుగొన్న ఇతర అంశాలలో, అధిక శాతం స్పందనదారులు (71%) అభిప్రాయపడిన దాని ప్రకారం సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలు మరియు రాయితీలు వంటివి ప్రస్తుత కాలంలో అవసరమైన ఆర్థిక మద్దతును అందిస్తాయి మరియు తమ కొనుగోలు నిర్ణయాలను తీసుకోవడానికీ ప్రోత్సాహమందిస్తాయి. మహారాష్ట్రలోని రెండు ముఖ్య ప్రాంతాలు- ముంబై, పూనెలలో గృహ విక్రయాలు అత్యధికంగా జరిగాయి. స్టాంప్‌డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం దీనిలో అత్యంత కీలక పాత్ర పోషించింది. మరీ ముఖ్యంగా సెప్టెంబర్‌ 2020 నుంచి మార్చి 2021 మధ్యకాలంలో డిమాండ్‌కు ఇది కారణమైంది.
 
‘‘నిర్మాణంలోని ప్రోపర్టీల కోసం బిల్డర్ల మార్జిన్లు నిర్మాణ వ్యయాలు పెరగడంతో తగ్గాయి మరియు దీనికి తోడు కొన్ని ప్రాంతాలలో భూముల ధరలు పెరగడం కూడా దీనికి దోహదం చేసింది. ఈ కారణం చేత, కనీస విక్రయ ధరలు (బీఎస్‌పీ) తగ్గేందుకు అతి తక్కువ ఆస్కారం ఏర్పడింది. అయితే, బిల్డర్లు ఇప్పుడు అత్యంత సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలు అందించడంతో పాటుగా వినియోగదారులను ఆకర్షించడానికి కొంత మంది రాయితీలను సైతం అందిస్తున్నారు’’ అని శ్రీ మణి రంగరాజన్‌, గ్రూప్‌ సీఓఓ, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ మరియు ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.
 
‘‘కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో గృహ మార్కెట్‌లో స్థిరత్వం కొనసాగింది. ఏప్రిల్‌- జూన్‌ 2021 మధ్యకాలంలో డిమాండ్‌తో పాటుగా సరఫరా కూడా గత సంవత్సరంతో  పోలిస్తే పెరిగింది. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం కొనుగోలుదారుల సెంటిమెంట్‌ సైతం జూన్‌ నుంచి వృద్ధి చెందింది. మరింత ఆసక్తిగా  ప్రజలు ఇప్పుడు ప్రోపర్టీల కోసం చూస్తున్నారు. ఈ పండుగ సీజన్‌లో డిమాండ్‌ మరింతగా పెరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని శ్రీ రంగరాజనః జోడించారు. గృహ కొనుగోలుదారులను ఆకర్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలను తగ్గించాల్సి ఉందని రంగరాజన్‌ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments