Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రేట్లలో మార్పులు లేవు... ఆర్బీఐ ప్రకటన... స్టాక్ మార్కెట్‌లో కుదుపులు

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (12:36 IST)
భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేట్, రివర్స్ రెపోరేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. దీంతో ముంబై స్టాక్ మార్కెట్‌ కుదుపులకు లోనైంది. ఆర్బీఐ కీలక నిర్ణయం వెలువరించిన మరుక్షణం స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులకు గురైంది. రెపోరేటు, రివర్స్‌ రేపో రేటులలో మార్పులు ఉండబోవంటూ ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నిర్ణయం ప్రకటించిన వెంటనే స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ కలిసిరావడంతో తిరిగి మార్కెట్‌ కోలుకుంటోంది.
 
శుక్రవారం ఉదయం 54,492 పాయింట్లతో సెన్సెక్స్‌ మొదలైంది. ఓ దశలో గరిష్టంగా 54,663 పాయింట్లను తాకింది. ఈ సమయంలో రిపోరేటు, రివర్స్‌ రిపోరేటుపై ఆర్బీఐ నిర్ణయం ప్రకటించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నట్టుగానే రిపో రేటు 4 శాతం, రివర్స్‌ రిపో రేటు 3.35 శాతంగానే కొనసాగుతాయని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. 
 
ఆర్బీఐ నుంచి ప్రకటన వెలువడిన మరుక్షణమే  దేశీ సూచీలు లాభాల నుంచి నష్టాల దిశగా దారి మార్చుకున్నాయి. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన గంట వ్యవధిలోనే 205 పాయిం‍ట్లు నష్టపోయి 54,287 వద్ద సెన్సెక్స్‌  ట్రేడయ్యింది. మరికాసేపటికే కోలుకుంది.
 
నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ ఈ రోజు ఉదయం 16,304 పాయింట్లతో మొదలైంది. ఓ దశలో 16,336 పాయింట్లకు చేరుకుంది. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన మరుక్షణం నుంచి పాయింట్లు కోల్పోవడం మొదలైంది. గంట వ్యవధిలో 41 పాయింట్లు నష్టపోయి 16,253 వద్ద ట్రేడయ్యింది. అయితే కాసేపటికే పుంజుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments