Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా ఏటీఎంలను మూసివేయండి : ఆర్బీఐ

భారత రిజర్వు బ్యాంకు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను తక్షణం మూసివేయాల్సిందిగా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులు బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను సైతం అతలాకుతలం చేస్తున్న

Webdunia
సోమవారం, 15 మే 2017 (11:42 IST)
భారత రిజర్వు బ్యాంకు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను తక్షణం మూసివేయాల్సిందిగా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులు బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను సైతం అతలాకుతలం చేస్తున్న విషయం తెల్సిందే. 
 
'వాన్నా క్రై' బీభత్సం బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను తాకకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్‌డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. వాన్నా క్రై రాన్సమ్‌వేర్ ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సహా వివిధ రంగాల కంప్యూటర్ నెట్‌వర్క్‌లను అతలాకుతలం చేసి, కీలకమైన డాటా మూసుకుపోయేలా చేసి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్యలకు దిగింది. 
 
మనదేశంలోని దాదాపు అన్ని ఏటీఎంలు విండోస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తోనే పనిచేస్తున్నాయి. అదీగాక దేశంలోని 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం ఏటీఎంలు ఔట్‌డేటెడ్ విండోస్ ఎక్స్‌పీపైనే ఆధారపడుతున్నాయి. దీంతో ఈ నెట్‌వర్క్‌పై మాల్‌వేర్ సులభంగా దాడి చేసే అవకాశం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం