Webdunia - Bharat's app for daily news and videos

Install App

దృశ్యం సీన్ రిపీట్.. కట్టుకున్న భార్యను కడతేర్చి.. అపార్ట్‌మెంట్లోనే పాతిపెట్టిన భర్త..

కట్టుకున్న భార్యను ఓ కసాయి భర్త కడతేర్చాడు. దృశ్యం సినిమాలో హీరో ఇంటి పెరట్లో పోలీసు అధికారి కుమారుడి మృతదేహాన్ని పాతిపెట్టినట్లే.. విజయవాడ వాంబే కాలనీలో అపార్ట్‌మెంట్ల మధ్య భార్య మృతదేహాన్ని పాతిపెట్

Webdunia
సోమవారం, 15 మే 2017 (11:15 IST)
కట్టుకున్న భార్యను ఓ కసాయి భర్త కడతేర్చాడు. దృశ్యం సినిమాలో హీరో ఇంటి పెరట్లో పోలీసు అధికారి కుమారుడి మృతదేహాన్ని పాతిపెట్టినట్లే.. విజయవాడ వాంబే కాలనీలో అపార్ట్‌మెంట్ల మధ్య భార్య మృతదేహాన్ని పాతిపెట్టాడు ఓ దుర్మార్గపు భర్త. వివరాల్లోకి వెళితే.. మృతురాలు మరియ్య దుర్గాప్రసాద్‌కి పదేళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. గత కొంతకాలంగా మరియమ్మ ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త దుర్గాప్రసాద్ ఓ ప్లాన్ వేశాడు. 
 
మరియమ్మను కడతేర్చడానికి నిర్ణయించుకున్నాడు. అంతే ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అతి కిరాతకంగా భార్య మరియమ్మను దుర్గా ప్రసాద్ హతమార్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా అపార్ట్‌మెంట్ల మధ్యనే గొయ్యి తీశాడు. డ్రైనేజీ కోసమంటూ తీసిన గొయ్యిలో భార్య శవాన్ని పాతిపెట్టాడు. ఇదంతా జరిగి రెండు నెలలైంది. మరియమ్మ గురించి అడిగిన వారందరికీ ఏదో ఒక సమాధానం చెప్తూ వచ్చాడు. పిల్లల్ని కూడా నమ్మించాడు. 
 
అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు మరియమ్మ కనిపించలేదని దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు చెప్పిన నిజాలు పోలీసులకు షాక్ ఇచ్చాయి. ఆపై అపార్ట్‌మెంట్‌లో భార్య శవాన్ని పాతిపెట్టినట్లు దుర్గాప్రసాద్ ఒప్పుకోవడంతో.. మీడియా సాక్షిగా, స్థానికులు చూస్తుండగా ఒక శవం కోసం పట్టపగలు తవ్వకం చేపట్టారు. ఓ పూటంతా జరిగిన తవ్వకంలో కుళ్లిపోయిన మహిళ శవం బయటపడింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments