Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిజిటల్ కార్యకలాపాలకు బ్రేక్.. ఆర్బీఐ

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (14:27 IST)
ప్రముఖ ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిజిటల్‌ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశించింది. గత రెండు సంవత్సరాలుగా హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, చెల్లింపులు తదితర కార్యకలాపాల్లో అంతరాయాలు చోటుచేసుకొంటున్నాయి.
 
తాజాగా నవంబర్‌ 21న బ్యాంకు ప్రైమరీ డాటా సెంటర్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవటంతో ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, చెల్లింపుల్లో ఆటంకాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీచేసిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వివరించింది.
 
బ్యాంకు డిజిటల్‌ 2.0 కార్యక్రమంతో సహా ఇతర ఐటీ అప్లికేషన్ల పరిధిలోకి వచ్చే అన్ని కార్యకలాపాలు, నూతన క్రెడిట్‌ కార్డుల జారీని ప్రస్తుతానికి నిలిపివేయవలసిందిగా ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా, పరిస్థితిని చక్కదిద్దేందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments