Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త క్రెడిట్ కార్డుల జారీ వద్దు : హెచ్‌డీఎఫ్‌సీకి ఆర్బీఐ ఝులక్

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (14:20 IST)
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీకి భారత రిజర్వు బ్యాంకు తేరుకోలేని షాకిచ్చింది. ఈ బ్యాంకు అందిస్తున్న ఆన్‌లైన్‌ సేవల్లో పలుమార్లు అంతరాయాలు ఏర్పడటంతో ఆర్బీఐ సీరియస్ అయింది. దీంతో కొత్త క్రెడిట్ కార్డులను జారీని తాత్కాలికంగా నిలిపి వేయాలని బ్యాంకును ఆదేశించింది. 
 
అంతేకాకుండా, కొత్త డిజిటల్ సేవలేవీ ప్రారంభించవద్దని కూడా స్పష్టంచేసింది. అదే సమయంలో బ్యాంకు ఐటీ వ్యవస్థల్లో ఉన్న లోటుపాట్లను తొలగించాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యాజమాన్యానికి సూచించింది. ఈ విషయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స్వయంగా స్టాక్ మార్కెట్లకు తెలిపింది. 
 
ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకే అత్యధికంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తొంది. కాగా, ఈ విషయంపై స్పందించిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఈ ఆదేశాల వల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలకు ఎటువంటి అంతరాయం కలగదని వివరణ ఇచ్చింది. తమ ఐటీ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపింది. 
 
గత రెండేళ్లుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆన్‌లైన్ సేవల్లో పలు మార్లు అంతరాయం ఏర్పడుతున్న విషయం తెల్సిందే. ఇటీవల బ్యాంకు డాటా సెంటర్లలో తలెత్తిన ఓ సమస్య కారణంగా.. ఏకంగా 12 గంటల పాటు ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. నెట్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులతో పాటూ.. ఏటీఎంలు కూడా పనిచేయలేదు. దీంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
 
ఈ సమస్యపై బ్యాంకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేదని కూడా వినియోగదారులు పెదవి విరిచారు. తమ డాటా సెంటర్లలో అనూహ్య సమస్య తలెత్తిందని పేర్కొన్న బ్యాంకు.. ఇందుకు గల కారణాలేమిటో మాత్రం స్పష్టంగా వివరించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments