Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో రాపిడో కార్యకలాపాల విస్తరణ, 14 కొత్త నగరాల్లో సేవలు ప్రారంభం

ఐవీఆర్
సోమవారం, 9 జూన్ 2025 (20:36 IST)
ఒంగోలు, విజయనగరం, ఏలూరు సహా 14 కొత్త నగరాల్లో సేవలను ప్రారంభించడం ద్వారా, రాపిడో ఆంధ్రప్రదేశ్‌లో తన యాప్ ఆధారిత రవాణా సేవల విస్తరణను వేగవంతం చేస్తోంది. భారతదేశంలోని ప్రముఖ రైడ్‌హైలింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన రాపిడో, ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించడంలో భాగంగా, 14 కొత్త నగరాల్లో బైక్ టాక్సీ మరియు ఆటో సేవలను ప్రారంభించింది. ఒంగోలు, విజయనగరం, ఏలూరు, మదనపల్లె, మచిలీపట్నం, చిత్తూరు, శ్రీకాకుళం, భీమవరం, గుడివాడ, నరసరావుపేట, నంద్యాల, తెనాలి, తాడేపల్లిగూడెం, తాడిపత్రి నగరాల్లో ఈ వ్యూహాత్మక విస్తరణతో, రాపిడో ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో యాప్ ఆధారిత మొబిలిటీ సేవలను అందిస్తున్నది.
 
ఈ కీలకమైన మైలురాయి ద్వారా, రాపిడో ఆంధ్రప్రదేశ్‌లో సౌకర్యవంతమైన, సరసమైన, అందుబాటులో ఉండే ప్రథమ మరియు తుదిమైల రవాణా కోసం వినియోగదారుల ఆదరణ పొందుతున్న ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌గా తన స్థానాన్ని మరింత బలపరిచింది. ఇది దేశవ్యాప్తంగా 500 నగరాల్లో సేవలు విస్తరించాలని రాపిడో లక్ష్యంగా పెట్టుకున్న దిశలో ముందుగడ స్థానిక రవాణా వ్యవస్థలను రూపుమాపడంలో సంస్థ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది.
 
గిగ్ ఎకానమీకి అండగా ఉంటున్న దేశాల్లో ఒకటిగా భారతదేశంలో రాపిడో ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 మిలియన్లకు పైగా ఉద్యోగాలను సృష్టించింది. ఈ విస్తరణతో, కంపెనీ 1 లక్ష కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించి, స్థానికులకు ఆర్థిక స్వాతంత్ర్యం, సౌకర్యవంతమైన సంపాదన సామర్థ్యాన్ని అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాపిడో ప్రస్తుతం రోజుకు 4 మిలియన్లకు పైగా రైడ్‌లను అందిస్తుంది. దేశంలోని ప్రముఖ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది.
 
ఈ సేవలు అందుబాటులోకి రావడంతో స్థానికులు ఇప్పుడు రాపిడో యాప్‌పై ఆధారపడవచ్చు- పనికి వెళ్లడం, సమీపంలోని ప్రజా రవాణా కేంద్రాల వరకు వెళ్లగలగడం, లేదా పట్టణంలోని ఆయా ప్రాంతాలకు తేలికగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. “ఆంధ్రప్రదేశ్‌లో రాపిడో సేవలను పరిచయం చేయడంలో మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. ఇది ప్రజలకు నమ్మదగిన రవాణా సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, వారు తమ పట్టణాల్లో చక్కగా ప్రయాణించగలిగే విధానాన్ని మెరుగుపరచడానికీ దోహదపడుతుంది. కేవలం రవాణాతో పాటు, ఈ ప్రారంభం ద్వారా వందలాది మంది స్థానిక యువతకు జీవనోపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు వారు రాపిడో క్యాప్టెన్లుగా చేరి ఆదాయం పొందగలుగుతారు. ప్రయాణికులను స్థానిక క్యాప్టెన్లతో కలిపించడం ద్వారా మేము రవాణా ప్రత్యామ్నాయాలను మెరుగుపరచడమే కాదు, స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తున్నాము" అని రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి అన్నారు.
 
మొబిలిటీకి మించి, ఈ విస్తరణ సూక్ష్మ-వ్యవస్థాపక అవకాశాలను కూడా అన్‌లాక్ చేస్తుంది. రాపిడో వేలాది మంది కొత్త కెప్టెన్‌లను చేర్చుకోవడం, ఆదాయ మార్గాలను సృష్టించడం, కమ్యూనిటీ-స్థాయి ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. సజావుగా సేవా ఏకీకరణను నిర్ధారించేందుకు, సురక్షితమైన, అనుకూలమైన మరియు కస్టమర్-స్నేహపూర్వక ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు స్థానిక అధికారులు, వాటాదారులతో చేరువగా  పనిచేసేందుకు రాపిడో కట్టుబడి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments